1. భారతీయ రైల్వే విశాఖపట్నం-విజయవాడ రూట్లో డబుల్ డెక్కర్ రైలును రీస్టోర్ చేసింది. 2022 ఏప్రిల్ 13 నుంచి డబుల్ డెక్కర్ రైలు (Double Decker Train) అందుబాటులోకి రానుంది. రైలు నెంబర్ 22701 విశాఖపట్నం నుంచి విజయవాడ రూట్లో డబుల్ డెక్కర్ రైలు ప్రయాణిస్తుంది. తెల్లవారుజామున 5.25 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరే రైలు అదే రోజు ఉదయం 11.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 22702 విజయవాడ నుంచి విశాఖపట్నం రూట్లో డబుల్ డెక్కర్ రైలు ప్రయాణిస్తుంది. సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయల్దేరే రైలు అదే రోజు రాత్రి 10.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు దారిలో ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. విశాఖపట్నం-విజయవాడ రూట్లో డబుల్ డెక్కర్ రైలుతో పాటు గుంటూరు-ఢోన్ రూట్లో మరో రెండు రైళ్లను పునరుద్ధరించింది రైల్వే. రైలు నెంబర్ 17228 గుంటూరు నుంచి ఢోన్ వరకు 2022 ఏప్రిల్ 13 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మధ్యాహ్నం 1 గంటకు గుంటూరులో బయల్దేరితే రాత్రి 9.15 గంటలకు ఢోన్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో పేరేచర్ల, ఫిరంగిపురం, నరసారావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, కంబం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, పాణ్యం, కృష్ణమకోన, బీ సిమెంట్ నగర్, బేతంచర్ల, రంగాపురం, మాల్కాపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైలు నెంబర్ 17227 ఢోన్ నుంచి వరకు గుంటూరు 2022 ఏప్రిల్ 14 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 6.30 గంటలకు ఢోన్లో బయల్దేరితే మధ్యాహ్నం 2.00 గంటలకు గుంటూరు ఢోన్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో మాల్కాపురం, రంగాపురం, బేతంచర్ల, బీ సిమెంట్ నగర్, కృష్ణమకోన, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, జగ్గంభొట్ల కృష్ణాపురం, కంబం, మార్కాపూర్ రోడ్, దొనకొండ, కూరిచేడు, వినుకొండ, నరసారావుపేట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)