1. భారతీయ రైల్వే ముంబై-అహ్మదాబాద్ రూట్లో తొలి బుల్లెట్ ట్రైన్ (Bullet Train) నడపబోతోంది. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు కూడా సిద్ధమవుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌కు (Bullet Train Station) సంబంధించిన నమూనాను భారతీయ రైల్వే ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టింది. నిర్మాణ పనులను మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థ అయిన లార్సెన్ అండ్ టూబ్రో (L&T) బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టింది. వడోదర పట్టణంలో హైస్పీడ్ రైల్ స్టేషన్ నిర్మాణం కోసం ఇటీవలే ఒప్పందం కుదిరింది. (image: Indian Railways)
3. ముంబై-అహ్మదాబాద్ రూట్లో మొత్తం 508.17 కిలోమీటర్ల దూరాన్ని బుల్లెట్ ట్రైన్ కవర్ చేయనుంది. ఇప్పుడు భారతీయ రైల్వే సూరత్‌లో హైస్పీడ్ రైల్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసింది. ఇందులో నిర్మాణ పనులతో పాటు నిర్మించిన తర్వాత ఈ స్టేషన్ ఎలా ఉండబోతుందన్న డిజైన్‌ను కూడా ట్వీట్ చేసింది. (image: Indian Railways)
4. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో మొత్తం 12 హైస్పీడ్ రైల్ స్టేషన్లు ఉంటాయి. అహ్మదాబాద్, సూరత్, సబర్మతీ, వడోదరా, ఆనంద్, బిలిమోరా, భరుచ్, విరర్, బోయిసర్, వాపి, ముంబై, థానెలో హైస్పీడ్ రైల్ స్టేషన్లు నిర్మాణం కానున్నాయి. సూరత్‌లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ స్టేషన్ 2024 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని అంచనా. (image: Indian Railways)
5. భారతదేశంలో మొదటి హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.1 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. 2026-27 సంవత్సరం నాటికి ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత ఈ కారిడార్‌పై ట్రయల్ పద్ధతిలో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ముంబై-అహ్మదాబాద్ రూట్లోనే కాదు... మరిన్ని రూట్లలో బుల్లెట్ రైళ్లను నడిపే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ముంబై-హైదరాబాద్, ఢిల్లీ-అహ్మదాబాద్, ఢిల్లీ-అమృత్సర్, వారణాసి-హౌరా, చెన్నై-మైసూర్ రూట్లో బుల్లెట్ రైళ్లు రానున్నాయి. వీటితో పాటు మరో నాలుగు రూట్లలో 9 పట్టణాలు, నగరాల్లో కలుపుతూ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ నిర్మించేందుకు ప్రణాళికలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. భారతీయ రైల్వే ఎంచుకున్న 9 నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య 618 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించాలన్న ప్రణాళికలున్నాయి. ఢిల్లీ-వారణాసి రూట్లో 958 కిలోమీటర్లు, లక్నో-అయోధ్య రూట్లో 123 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ కారిడార్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నాగ్‌పూర్, వారణాసి, గువాహతి, అమృత్సర్, పఠాన్‌కోట్, జమ్మూ నుంచి పలు రూట్లలో బుల్లెట్ రైళ్లు రానున్నాయి. అయితే ఇవి ప్రతిపాదనలు మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)