1. ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే అరకొర సదుపాయాలు, బిజీబిజీగా కనిపించే జనం, ఇరుకైన స్థలాలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్లు కూడా ఎయిర్ పోర్టుల్ని తలపిస్తున్నాయి. ఎయిర్ పోర్టులతో పోటీ పడేలా అత్యాధునిక హంగులతో రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దుతోంది భారతీయ రైల్వే. (image: Indian Railways)
5. ఇందులో లగ్జరీ హోటల్ కూడా ఉంది. థీమ్ బేస్డ్ లైటింగ్ ప్రయాణికులను ఆకట్టుకుంటుంది. అన్ని మతాల ప్రయాణికులు ప్రార్థన చేసుకోవడానికి హాల్ కూడా ఉంది. ఈ రైల్వే స్టేషన్ లోపలికి రావడానికి, బయటకు వెళ్లడానికి వేర్వేరు దారులు ఉండటం విశేషం. లిఫ్టులు, ప్రత్యేకమైన పార్కింగ్ స్పేస్ ఉన్నాయి. (image: Indian Railways)
6. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వే స్టేషన్లో కాన్కోర్స్ కూడా నిర్మించారు. ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పుడు దీనిని ఉపయోగించుకోవచ్చు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా టికెట్ బుకింగ్ కౌంటర్లు కూడా ఉన్నాయి. లైవ్ ఎల్ఈడీ వాల్ డిస్ప్లే లాంజ్తో పాటు ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. (image: Indian Railways)