1. భారతీయ రైల్వే (Indian Railways) నిత్యం వేలాది రైళ్లల్లో లక్షలాది మంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజా రవాణా నెట్వర్క్లల్లో భారతీయ రైల్వే ఒకటి. రైల్వే తమ ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇండియన్ రైల్వేస్ తమ ప్రయాణికులకు రైల్వే ట్రావెల్ ఇన్స్యూరెన్స్ (Railways Travel Insurance) పేరుతో బీమా సదుపాయాన్ని కూడా అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైల్వే ప్రయాణికులు కేవలం ఒక్క రూపాయి కంటే తక్కువ ప్రీమియం చెల్లించి రూ.10 లక్షల వరకు బీమా పొందవచ్చు. అయితే ఇది ఆప్షనల్ మాత్రమే. రైల్వే ప్రయాణికులు కావాలనుకుంటేనే ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులకు రైల్వే ప్రయాణ బీమా అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీరు ఆన్లైన్లో ట్రైన్ టిక్కెట్స్ బుక్ చేసినప్పుడు, వెబ్సైట్లో రైల్వే ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈసారి రిజర్వేషన్ చేసే సమయంలో ఇన్స్యూరెన్స్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి. ప్రీమియం కేవలం 35 పైసలు మాత్రమే ఉంటుంది. ట్రైన్ టికెట్ ఛార్జీలో బీమా డబ్బులు యాడ్ అవుతాయి. ఇన్స్యూరెన్స్ ఆప్షన్ ఎంచుకొని టికెట్ బుక్ చేసిన తర్వాత మీ ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్కు బీమా కంపెనీ నుంచి లింక్ వస్తుంది. లింక్ క్లిక్ చేసి నామినీ వివరాలు యాడ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. రైల్వే ప్రయాణికులు ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. చాలామంది ఇన్స్యూరెన్స్కు డబ్బులు చెల్లించి, నామినీ పేరు యాడ్ చేయడం మర్చిపోతుంటారు. బీమా పాలసీలో నామినీ ఉంటేనే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ సాధ్యమవుతుంది. రైలు ప్రమాదం సంభవించినప్పుడు, ప్రయాణికుడికి నష్టం కలిగితే అందుకు అనుగుణంగా బీమా కంపెనీ నుంచి పరిహారం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. రైల్వే ప్రయాణికుడు రైలు ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షలు బీమా నామినీకి చెల్లిస్తారు. మరణించిన రైలు ప్రయాణికుడి మృతదేహాన్ని తరలించడానికి బీమా ప్రొవైడర్ అదనంగా రూ.10,000 చెల్లిస్తారు. ప్రమాదంలో శాశ్వత వైకల్యానికి గురైతే రైల్వే ప్రయాణికుడికి రూ.10 లక్షలు అందుతాయి. పాక్షిక వైకల్యానికి గురైతే రూ.7.5 లక్షల ఇస్తారు. రైల్వే ప్రయాణికుడు గాయాలపాలైతే ఆసుపత్రి ఖర్చులకు రూ.2 లక్షలు ఇస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)