1. భారతీయ రైల్వే వీక్లీ హమ్‌సఫర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్‌ను (Humsafar Superfast train) ప్రకటించింది. ఈ రైలు రాజస్తాన్ నుంచి తమిళనాడుకు వెళ్తుంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల మీదుగా ఈ సూపర్ ఫాస్ట్ రైలు ప్రయాణిస్తుంది. డిసెంబర్ 18న ఈ రైలు అజ్మేర్లోని బయల్దేరితే డిసెంబర్ 21న రామేశ్వరం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రాత్రి 11.18 గంటలకు వరంగల్, సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు విజయవాడలో, 6.04 గంటలకు నెల్లూరులో, 6.49 గంటలకు గూడూరు జంక్షన్లో ఆగుతుంది. చెన్నై ఎగ్మోర్, చెంగల్పట్టు, విల్లుపురం జంక్షన్, అరియలూర్, తిరుచిరాపల్లి, మనమదురై జంక్షన్ మీదుగా రాత్రి 9 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన రైళ్లను భారతీయ రైల్వే పునరుద్ధరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాజస్తాన్ నుంచి రైళ్లను పునరుద్ధరిస్తోంది. దేశవ్యాప్తంగా 1700 రెగ్యులర్ రైళ్లను పనురుద్ధరిస్తోంది ఇండియన్ రైల్వేస్. మరోవైపు ముంబై, న్యూఢిల్లీ మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్త కోచ్‌లను అమర్చింది రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
6. రైళ్లల్లో వండే ఆహార పదార్థాలను కూడా అందించడం మొదలుపెట్టింది రైల్వే. కోవిడ్ 19 ఆంక్షల కారణంగా కొన్నాళ్లపాటు రైళ్లల్లో ఈ సేవల్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. కేవలం ప్యాక్డ్ ఫుడ్ మాత్రమే అందించింది. కానీ ప్యాక్డ్ ఫుడ్ కొనేవాళ్లు ఎక్కువగా లేకపోవడంతో వండిన ఆహారపదార్థాలను అందిస్తోంది రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)