1. సంక్రాంతి రోజున సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో వందే భారత్ రైలు ప్రారంభమైంది. భారతీయ రైల్వే మొదటి వందే భారత్ రైలును 2019లో ప్రారంభించింది. ఇప్పటివరకు 8 వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. అందులో సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో 8వ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రైలు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మిగతా 7 రైళ్ల రూట్స్ ఇవే. (ప్రతీకాత్మక చిత్రం)
2. న్యూఢిల్లీ- వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్: 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ- వారణాసి మార్గంలో మోదీ మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఢిల్లీ- వారణాసి మధ్య 770 కి.మీ దూరాన్ని కేవలం 8 గంటల్లో కవర్ చేస్తుంది. ఇది కాన్పూర్, ప్రయాగ్‌రాజ్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ట్రైన్ నెం.22436తో సోమ, గురువారాలు మినహా అన్ని రోజులలో నడుస్తుంది. న్యూఢిల్లీ నుంచి ఉదయం 6:00 గంటలకు ప్రారంభమై 14:00 గంటలకు వారణాసి చేరుకుంటుంది. వారణాసి నుంచి తిరిగి 15:00 గంటలకు బయలుదేరి 23:00 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఏసీ ఛైర్‌కార్ టికెట్ ధర రూ.1,670 కాగా, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ ధర రూ.3,075గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. న్యూఢిల్లీ- కాట్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్: 2019 అక్టోబర్ 3న న్యూఢిల్లీ- కాట్రా మధ్య రెండో ట్రైన్‌ను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ మార్గంలో అంబాలా కాంట్, లుధియానా, జమ్ము తావి అనే 3 స్టేషన్లలో ఆగుతుంది. మొత్తం 650 కి.మీల దూరాన్ని 8 గంటల్లో కవర్ చేస్తుంది. ట్రైన్ నెం.22439తో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి 14:00 గంటలకు కత్రా చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. గాంధీనగర్- ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్: మూడో ట్రైన్‌ను మోదీ, 2022 సెప్టెంబర్ 30న గాంధీనగర్- ముంబై మార్గంలో ప్రారంభించారు. ట్రైన్ నెం.20902తో నడిచే ఈ ట్రైన్ 6 గంటల 15 నిమిషాలలో 520 కి.మీ దూరాన్ని చేరుకుంటుంది. ఆదివారం మినహా అన్ని రోజులలో నడుస్తుంది. అహ్మదాబాద్, వడోదర, సూరత్ స్టేషన్లలో ఆగుతుంది. గాంధీనగర్ నుంచి సాయంత్రం 14:05 గంటలకు బయలుదేరి 20:15 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది. ముంబై నుంచి తిరిగి ఉదయం 6:10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:25 గంటలకు గాంధీనగర్ చేరుకుంటుంది. ఏసీ ఛైర్ కార్ టిక్కెట్ ధర రూ.1,320, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ ధర రూ.2,415 గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. న్యూఢిల్లీ- అంబ్ అందౌర వందే భారత్ ఎక్స్‌ప్రెస్: 2022 అక్టోబరు 13న నాలుగో ట్రైన్‌ను ఉనా స్టేషన్ నుంచి మోదీ ప్రారంభించారు. నెం.22447తో నడిచే ఈ ట్రైన్ 415 కి.మీ దూరాన్ని 5 గంటల 15 నిమిషాలలో కవర్ చేస్తుంది. శుక్రవారం మినహా అన్ని రోజులలో నడుస్తుంది. అంబాలా కాంట్, చండీగఢ్, ఆనంద్‌పూర్ సాహిబ్, ఉనా అనే 4 స్టేషన్లలో ఆగుతుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ నుంచి ఉదయం 5:50 గంటలకు బయలుదేరి 11:05 గంటలకు అంబ్ అందౌరా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 13:00 గంటలకు బయలుదేరి 18:25 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. AC ఛైర్‌కార్ టిక్కెట్ ధర రూ.1,155, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ ధర రూ.2,065గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. చెన్నై- మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్: దక్షిణ భారతదేశంలో మొదటి, సిరీస్‌లో 5వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను చెన్నై- మైసూరు మార్గంలో 2022 నవంబర్ 11న ప్రారంభించారు. ఈ ట్రైన్ కాట్పాడి, KRS బెంగళూరులో ఆగుతుంది. నెం.20607తో నడిచే ఈ ట్రైన్ 6 గంటల 30 నిమిషాలలో గమ్యస్థానం చేరుకుంటుంది. చెన్నై నుంచి ఉదయం 5:50 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:20 గంటలకు మైసూరు చేరుకుంటుంది. మైసూరు నుంచి మధ్యాహ్నం 13:05 గంటలకు బయలుదేరి రాత్రి 19:30 గంటలకు చెన్నై చేరుకుంటుంది. ఏసీ ఛైర్‌కార్ టికెట్ ధర రూ.1,270, ఎగ్జిక్యూటివ్ ఛైరకార్ ధర రూ.2,290గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. బిలాస్పూర్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్: దేశంలోని ఆరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బిలాస్పూర్- నాగ్‌పూర్ మార్గంలో నడుస్తుంది. దీన్ని గతనెల అందుబాటులోకి తీసుకొచ్చారు. శనివారం మినహా వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ 5 గంటల 30 నిమిషాలలో 400 కి.మీ ప్రయాణం చేస్తుంది. రాయ్‌పూర్, దుర్గ్, రాజ్ నంద్‌గావ్, గోండియా స్టేషన్లలో ఆగుతుంది. నెం.20825తో నడిచే ఈ ట్రైన్ ఉదయం 5:45 గంటలకు బిలాస్పూర్ నుంచి ప్రారంభమై నాగ్‌పూర్‌కు మధ్యాహ్నం 12:15 గంటలకు చేరుకుంటుంది. నాగ్‌పూర్ నుంచి తిరిగి సాయంత్రం 14:05 గంటలకు బయలుదేరి రాత్రి 19:35 గంటలకు బిలాస్పూర్ చేరుకుంటుంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ ధర రూ.2,240 కాగా, AC ఛైర్‌కార్ టికెట్ ధర రూ.1,240గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. హౌరా- న్యూ జల్పైగురి జంక్షన్(NJP) వందే భారత్ ఎక్స్‌ప్రెస్: హౌరా- న్యూ జల్పైగురి జంక్షన్(NJP) మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో ఏడోది. డిసెంబర్ 30న మోదీ ప్రారంభించారు. వందే భారత్ సిరీస్‌లో రెండో ప్రీమియం రైలు. నెం.22301తో నడిచే ఈ ట్రైన్ బుధవారం మినహా వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. హౌరా నుంచి ఉదయం 5.55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13:25 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. 600 కిలోమీటర్ల దూరాన్ని 7.5 గంటల్లో కవర్ చేస్తుంది. NJP నుంచి ఈ రైలు 15:05 గంటలకు బయలుదేరుతుంది తిరిగి 22:35 గంటలకు హౌరా చేరుకుంటుంది. బోల్పూర్ (శాంతినికేతన్), మాల్దా టౌన్, బర్సోయి స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)