HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
INDIAN RAILWAYS OPERATING 80 SPECIAL TRAINS FROM TODAY KNOW HOW TO BOOK TICKETS ON IRCTC SS
Special Trains: ప్రత్యేక రైళ్లకు టికెట్ బుకింగ్ చేయండి ఇలా
Indian Railways Special Trains | భారతీయ రైల్వే మరో 80 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీంతో 310 రైళ్లు దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లకు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి.
News18 Telugu | September 12, 2020, 9:03 AM IST
1/ 7
1. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా మొత్తం 310 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దశలవారీగా స్పెషల్ ట్రైన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. దేశవ్యాప్తంగా ప్రధాన రూట్లలో 310 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.. టికెట్ బుకింగ్ ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో కూడా టికెట్లు తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ప్రస్తుతం ప్రకటించిన 80 ప్రత్యేక రైళ్లతో పాటు 310 రైళ్లలో ప్రయాణించాలనుకునేవారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో టికెట్లు బుక్ చేయాలి. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక రైళ్లలో వెళ్లాలనుకునేవారు టికెట్లు ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. ముందుగా ఐఆర్టీసీ అధికారిక వెబ్సైట్ చేలా యాప్ ఓపెన్ చేయండి. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. Book Your Ticket పైన క్లిక్ చేయాలి. ఏఏ రూట్లలో రైళ్లు నడుస్తున్నాయో ముందే తెలుసుకొని టికెట్లు బుక్ చేయడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. రైల్వే స్టేషన్, ప్రయాణ తేదీ, ట్రావెల్ క్లాస్ ఎంచుకోవాలి. ఏ తేదీలో ప్రయాణించడానికైనా సరే అనుకుంటే Flexible with Date పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Find trains పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో రైళ్ల వివరాలు కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. రైలు రూట్, టైమింగ్స్ చెక్ చేసుకొని ఎంచుకోవాలి. check availability & fare పైన క్లిక్ చేసి ఖాళీ బెర్తులు, ఛార్జీల వివరాలు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత Book Now పైన క్లిక్ చేయాలి. ప్రయాణికుల వివరాలు ఎంటర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్‌లో ఏదైనా ఆప్షన్ ఎంచుకొని బుకింగ్ పూర్తి చేయాలి. బుకింగ్ పూర్తైన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)