1. ఆంధ్రా ఊటీగా పిలిచే అరకు అందాలు చూడటానికి వెళ్లే పర్యాటకులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. పర్యాటకు రద్దీని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం-అరకు మధ్య మరో 32 రైళ్లను నడుపుతున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. 2022 డిసెంబర్ 3 నుంచి 2023 జనవరి 22 మధ్య ప్రతీ శనివారం, ఆదివారం అరకు స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. అరకు నుంచి విశాఖపట్నం రూట్లో వీకెండ్లో 16 స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక రైలు నెంబర్ 08502 అరకు నుంచి విశాఖపట్నం మధ్య 2023 జనవరి 22 వరకు ప్రతీ శనివారం, ఆదివారం అందుబాటులో ఉంటాయి. ఈ రైలు అరకులో మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. విశాఖపట్నం-అరకు రూట్లో నడిచే ప్రత్యేక రైళ్లల్లో ఐదు సెకండ్ క్లాస్ కోచ్‌లో, ఏడు జనరల్ క్లాస్ కోచ్‌లు, రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లు దారిలో సింహాచలం, కొత్తవలస, బొర్రాగుహలు స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్ల బుకింగ్ ఐఆర్సీటీసీ అధికారిక యాప్, వెబ్సైట్లో ప్రారంభమైంది. (ప్రతీకాత్మక చిత్రం)

6. విస్టాడోమ్ ట్రైన్లో విశాఖపట్నం నుంచి అరకుకు రూ.735 ఛార్జీ ఉంటుంది. స్లీపర్ క్లాస్ ఛార్జీ రూ.145 కాగా, సెకండ్ సిట్టింగ్ ఛార్జీ రూ.75. ఇక ప్రత్యేక రైళ్లల్లో స్లీపర్ క్లాస్ ఛార్జీ రూ.235. ప్రత్యేక రైళ్లలో అద్దాల బోగీ ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకొని పర్యాటకులు రైలు టికెట్లు బుక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక ఐఆర్సీటీసీ టూరిజం విశాఖపట్నం నుంచి ఒక రోజు అరకు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.2385. పర్యాటకుల్ని రైలులో అరకు తీసుకెళ్లి, అరకులోని పర్యాటక ప్రాంతాలు చూపించి రోడ్డు మార్గంలో విశాఖపట్నం తీసుకొస్తుంది. ఈ ప్యాకేజీలో అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)