1. సోలాపూర్ డివిజన్లో పలు నిర్మాణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు డైవర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చిలోనే విశాఖపట్నం-ముంబై రూట్లలో నడిచే రెండు రైళ్లను రద్దు చేసింది భారతీయ రైల్వే. అయితే మార్చి 30 వరకే ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్టు మొదట ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
2. సోలాపూర్ డివిజన్లో భలవాని-భిగ్వాన్ రూట్లో డబ్లింగ్ వర్క్స్ ఇంకా కొనసాగుతుండటంతో ఇంకొన్ని రోజులు నాలుగు రైళ్లు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో పాటు నాలుగు రైళ్లను డైవర్ట్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
3. తాజా సమాచారం ప్రకారం రైలు నెంబర్ 08519 విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 6 వరకు అందుబాటులో ఉండదు. ఇక రైలు నెంబర్ 08519 లోకమాన్య తిలక్ టెర్మినస్-విశాఖపట్నం ప్రత్యేక రైలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు నడవదు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
4. వీటితోపాటు మరో రెండు రైళ్లను రద్దు చేసింది భారతీయ రైల్వే. పన్వేల్ నుంచి హెచ్ఎస్ నాందేడ్ రూట్లో నడిచే 07613 నెంబర్ గల రైలును ఏప్రిల్ 8 వరకు, హెచ్ఎస్ నాందేడ్ నుంచి పన్వేల్ రూట్లో నడిచే 07614 నెంబర్ గల రైలును ఏప్రిల్ 7 వరకు రద్దు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
5. దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన ఈ నాలుగు రైళ్లలో ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
6. మరి కొన్ని రైళ్ల రూట్లు మార్చింది రైల్వే. రైలు నెంబర్ 06339 శివాజీ టెర్మినస్ ముంబై-నాగర్‌కోయిల్ రూట్లో ఏప్రిల్ 1, 3, 6, 7 తేదీల్లో కొంకణ్ రైల్వే, షోరనూర్, ఎరోడ్ రూట్లో వెళ్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
7. ఇక రైలు నెంబర్ 06340 నాగర్‌కోయిల్-శివాజీ టెర్మినస్ ముంబై రూట్లో ఏప్రిల్ 2, 5, 6, 7 తేదీల్లో ఎరోడ్, షోరనూర్, కొంకణ్ రైల్వే రూట్లో వెళ్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
8. ఇక రైలు నెంబర్ 06351 శివాజీ టెర్మినస్ ముంబై-నాగర్‌కోయిల్ రూట్లో ఏప్రిల్ 2, 4 తేదీల్లో కొంకణ్ రైల్వే, షోరనూర్, ఎరోడ్ రూట్లో వెళ్తుంది. (ప్రతీకాత్మక చిత్రం
9/ 9
9. రైలు నెంబర్ 06352 నాగర్‌కోయిల్-శివాజీ టెర్మినస్ ముంబై రూట్లో ఏప్రిల్ 1, 4 తేదీల్లో ఎరోడ్, షోరనూర్, కొంకణ్ రైల్వే రూట్లో వెళ్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)