1. తిరుపతి రైల్వే స్టేషన్‌ను (Tirupati Railway Station) వాల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా మార్చే పనులు వేగవంతం అయ్యాయని, అన్ని కాంట్రాక్టులు ఇచ్చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్లో వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్ రూపురేఖలు ఎలా మారబోతున్నాయో గ్రాఫిక్స్ విడుదల చేశారు. ఈ గ్రాఫిక్స్ ఆకట్టుకుంటున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. భారతీయ రైల్వే తిరుపతి రైల్వే స్టేషన్‌ను వాల్డ్ క్లాస్ హబ్‌గా మారుస్తామని 2019 సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 నాటికి తిరుపతి రైల్వే స్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని భారతీయ రైల్వే ప్రకటించింది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిపోవడంతో మళ్లీ కదలిక వచ్చింది. (Image: Twitter/SCRailwayIndia)
3. తిరుపతి రైల్వే స్టేషన్‌ను వాల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల కోసం కాంట్రాక్టుల్ని అప్పగించింది భారతీయ రైల్వే. రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (RLDA) తిరుపతి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి బాధ్యతల్ని చేపట్టింది. ఉపయోగంలో లేని ప్రభుత్వ భూమిని గుర్తించి, ప్రైవేట్ సంస్థలతో కలిసి అభివృద్ధి చేసే పనుల్ని రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (RLDA) చూసుకుంటుంది. (Image: Twitter/SCRailwayIndia)
4. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య నిత్యం పెరుగుతోంది. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో తిరుపతి రైల్వే స్టేషన్ నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. (Image: Twitter/Ashwini Vaishnaw)
5. తిరుపతి వాల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ పనుల కోసం పీపీపీ మోడల్ ద్వారా ప్రాజెక్టును చేపట్టింది భారతీయ రైల్వే. తిరుపతి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టులో ఓపెన్ వెయిటింగ్ హాల్, ఎయిర్‌పోర్టు తరహా లైటింగ్, ప్రీమియం ఏసీ వెయిటింగ్ లాంజ్, ఇతర సదుపాయాలు ఉంటాయి. తిరుపతి రైల్వే స్టేషన్లో మొత్తం 23 లిఫ్టులు, 20 ఎస్కలేటర్లు, ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలు, కోచ్ ఇండికేషన్, ట్రైన్ ఇండికేషన్ బోర్డులు ఉంటాయి. (Image: Twitter/Ashwini Vaishnaw)
6. నార్త్ బ్లాక్‌లో గ్రౌండ్ ఫ్లోర్లో డిపార్చర్ కాంకోర్స్, అరైవల్ కాంకోర్స్, టికెట్ కౌంటర్, వెయిటింగ్ లాంజ్, ఫస్ట్ ఫ్లోర్లో కామన్ వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, టాయిలెట్స్, క్లాక్ రూమ్, సెకండ్ ఫ్లోర్లో షాప్స్, కియాస్క్స్, టాయిలెట్స్, మూడో ఫ్లోర్లో రైల్వే కార్యాలయాలు ఉంటాయి. ఎయిర్ కాంకోర్స్‌లో వెయిటింగ్ హాల్, షాపులు, ఫుడ్ కోర్ట్, బెంచీలు ఉంటాయి. (Image: Twitter/Ashwini Vaishnaw)
7. సౌత్ బ్లాక్‌లో పార్కింగ్ సదుపాయం, డిపార్చర్ కాంకోర్స్, అరైవల్ కాంకోర్స్, టికెట్ కౌంటర్, గ్రౌండ్ ఫ్లోర్లో వెయిటింగ్ లాంజ్, కామన్ వెయిటింగ్ హాల్, ఫీమేల్ వెయిటింగ్ ఏరియా, ఫుడ్ కోర్ట్, టాయిలెట్స్, మొదటి, రెండో ఫ్లోర్స్‌లో క్లాక్ రూమ్, మూడో ఫ్లోర్లో రైల్వే ఆఫీసులు, రెస్ట్ రూమ్స్ ఉంటాయి. (Image: Twitter/Ashwini Vaishnaw)