* మీల్స్ బుకింగ్ తప్పనిసరి కాదు : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో క్యాటరింగ్ సేవలను పొందడం ఆప్షనల్. ఈ రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు భోజనం బుక్ చేసుకోవడం ఇకపై తప్పనిసరి కాదు. ప్రయాణీకులు తమ సొంత ఆహారాన్ని వెంట తెచ్చుకుంటే, క్యాటరింగ్ సేవలు పొందాల్సిన అవసరం ఉండదు. పైగా టికెట్ ధర కూడా తగ్గుతుంది.
* ఆన్‌బోర్డ్ మీల్స్ ఎక్కువ ధర : ఆన్‌బోర్డ్‌లో ఉన్నప్పుడు అవసరమనుకుంటే ఆర్డర్ కూడా చేయవచ్చు. అయితే ప్రతి ఐటమ్కు వసూలు చేసే డబ్బు ముందుగా బుక్ చేసుకునే భోజనం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైలు టికెట్‌తో పాటు భోజనాన్ని ముందుగానే బుక్ చేసుకోవడం ఉత్తమం. ఉదాహరణకు రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకునేటప్పుడు భోజనం ఆర్డర్ చేసుకోవడానికి రూ.155 ఖర్చవుతుంది. అయితే అదే భోజనాన్ని రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆర్డర్ ఇస్తే రూ.205 చెల్లించాల్సి ఉంటుంది.
* బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ధరలు : చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ క్లాస్ కోచ్‌లలో భోజనం ధర వరుసగా రూ.364, రూ.415గా నిర్ణయించారు. ఆన్‌బోర్డ్ సమయంలో ఒక కప్పు టీ కోసం రూ.15 ఖర్చు చేయాల్సి ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటే చైర్ కార్ క్లాస్‌లో రూ.122, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో అయితే రూ.155 చెల్లించాల్సి ఉంటుంది. లంచ్- డిన్నర్ కోసం ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌లో రూ.244, చైర్ కార్ కోచ్‌లో రూ.222 చెల్లించాల్సి ఉంటుంది.
* సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య పరుగులు : దేశంలో ప్రస్తుతం 8 వందే భారత్ రైళ్లు ఉన్నాయి. జనవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ సర్వీస్‌ను ప్రారంభించారు. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య ప్రతి రోజు నడవనున్న ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో ఛైర్ కార్ ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి.
* 16 కోచ్‌ల్లో 1,128 మంది ప్రయాణికులు : సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో 14 ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు, రెండు ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. మొత్తంగా 16 కోచ్‌లలో 1,128 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు సేవలందిస్తుంది. విశాఖ( ట్రైన్ నం.20833) నుంచి ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది.