2. ప్రస్తుతం న్యూ ఢిల్లీ-వారణాసి, న్యూ ఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, న్యూ ఢిల్లీ-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్-గాంధీ నగర్, మైసూర్-చెన్నై రూట్లలో వందే భారత్ రైళ్లు తిరుగుతున్నాయి. భారతీయ రైల్వే తర్వాతి వందే భారత్ రైలును ఏ రూట్లో ప్రారంభిస్తుందనేదానిపై అనేక వార్తలు వస్తున్నాయి. (image: Indian Railways)
3. వాస్తవానికి దీపావళి తర్వాత ఐదో వందే భారత్ రైలు తెలంగాణకు వస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఐదో వందే భారత్ రైలు మైసూర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి ప్రారంభించారు. దక్షిణ భారతదేశానికి అందుబాటులోకి వచ్చిన తొలి వందే భారత్ రైలు ఇదే. దీంతో తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు ఎదురుచూపులే మిగిలాయి. (image: Indian Railways)
4. త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వందే భారత్ రైలు అందుబాటులోకి రానుందని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. భారతీయ రైల్వే పలు రూట్లను పరిశీలిస్తోందన్నది ఆ వార్తల సారాంశం. సికింద్రాబాద్-విజయవాడ రూట్లో వందే భారత్ రైలు నడిపేందుకు టెక్నికల్ క్లియరెన్స్ వచ్చిందని కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రూట్లో అందుబాటులోకి వచ్చే వందే భారత్ రైలును తిరుపతి వరకు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డును కోరినట్టు వివరించారు. (image: Indian Railways)
5. డిసెంబర్లో తెలంగాణతో పాటు బీహార్‌కు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తాజాగా వార్తలొస్తున్నాయి. బీహార్, తెలంగాణలో రైల్వే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లను నడపాలని రైల్వే భావిస్తోంది. డిసెంబర్ చివరి వారంలోగా ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయని పలు వార్తలొస్తున్నాయి. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికుల ఎదురుచూపులు ఫలించినట్టే. (image: Indian Railways)
7. ఇక భారతీయ రైల్వే వందే భారత్ రైలును నడిపేందుకు మరో రూట్‌ను కూడా పరిశీలిస్తోందని ఇటీవల వార్తలొచ్చాయి. వైజాగ్-సికింద్రాబాద్ రూట్లో వందే భారత్ రైలును నడపాలని భారతీయ రైల్వే ఆలోచిస్తోంది. వాల్తేర్ డివిజన్ రైల్వే మేనేజర్ కూడా ఈ ఏడాదిలోనే వైజాగ్ నుంచి వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తుందని ఇటీవల చెప్పారు. (image: Indian Railways)