1. రెస్టారెంట్ ఆన్ వీల్స్ (Restaurant on Wheels)... ఇటీవల పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న పాపులర్ కాన్సెప్ట్. రైలు బోగీనే రెస్టారెంట్‌గా మార్చడమే ఈ కాన్సెప్ట్ ప్రత్యేకత. ఇటీవల ఇలాంటి రెస్టారెంట్లను తెరుస్తోంది భారతీయ రైల్వే. రైల్వే స్టేషన్లను సుందరీకరించడంతో పాటు పర్యాటకుల్ని ఆకట్టుకునేలా ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. (image: Indian Railways)
3. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్లో హెరిటేజ్ గల్లీలో ప్లాట్‌ఫామ్ నెంబర్ 18 కి ఎదురుగా రెస్టారెంట్ ఆన్ వీల్స్ చూడొచ్చు. హెరిటేజ్ గల్లీలో నారో గేజ్ లోకోమోటీవ్స్, పాత ప్రింటింగ్ ప్రెస్ పార్ట్స్ లాంటి వారసత్వ సంపదను చూడొచ్చు. అక్కడే రెస్టారెంట్ ఆన్ వీల్స్ ప్రారంభించడం విశేషం. (image: Indian Railways)
4. ఉపయోగంలో లేని రైలు బోగీని తీసుకొని రెస్టారెంట్‌గా మార్చడం విశేషం. ఇందులో 10 టేబుల్స్ ఉన్నాయి. 40 మంది కూర్చోవచ్చు. బోగీ లోపల ఇంటీరియర్‌ను అద్భుతంగా తీర్చి దిద్దారు. కళ్లు చెదిరే లైటింగ్, ఫ్యాన్లు, ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్ ప్రత్యేకతను తెలిపే పెయింటింగ్స్ కనిపిస్తాయి. (image: Indian Railways)