1. భారతీయ రైల్వే నాగ్‌పూర్ రైల్వే స్టేషన్లో 'రెస్టారెంట్ ఆన్ వీల్స్' ప్రారంభించింది. సెంట్రల్ రైల్వే ప్రారంభించిన రెండో 'రెస్టారెంట్ ఆన్ వీల్స్' ఇది. అంతకన్నా ముందు 2021 అక్టోబర్‌లో ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో సెంట్రల్ రైల్వే మొదటి 'రెస్టారెంట్ ఆన్ వీల్స్' ప్రారంభించిన సంగతి తెలిసిందే. (image: Indian Railways)
2. నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ ఆవరణలో 'రెస్టారెంట్ ఆన్ వీల్స్' ప్రారంభమైంది. నాగ్‌పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న స్వీట్స్ అండ్ స్నాక్స్ బ్రాండ్ హల్దీరామ్స్ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. 'హల్దీరామ్ ఎక్స్‌ప్రెస్ రెస్టారెంట్' పేరుతో ప్రారంభించడం విశేషం. ఈ రెస్టారెంట్లో డైన్ ఇన్ సర్వీస్‌తో పాటు టేక్ అవే సేవలు కూడా ఉన్నాయి. (image: Indian Railways)
3. కస్టమర్లు రెస్టారెంట్ లోపల కూర్చొని యాంబియన్స్‌ను ఎంజాయ్ చేస్తూ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. లేదా పార్శిల్ తీసుకొని వెళ్లొచ్చు. 24 గంటలు ఈ రెస్టారంట్ తెరిచే ఉంటుంది. రైలు లోపల యాంబియెన్స్, లైటింగ్ అదిరిపోయింది. రైల్ థీమ్‌తోనే డెకరేషన్ ఉండటం విశేషం. నాగ్‌పూర్ పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతాల పెయింటింగ్స్‌తో లోపల డెకరేట్ చేశారు. (image: Indian Railways)
4. రైల్వే ప్రయాణికులు మాత్రమే కాదు... సాధారణ ప్రజలు కూడా ఈ రెస్టారెంట్‌కు రావొచ్చు. లోపల 40 మంది కూర్చొని భోజనం చేయొచ్చు. నార్త్, సౌత్, కాంటినెంటల్‌తో పాటు ఇతర వంటకాలు ఈ రెస్టారెంట్లో లభిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఉండటంతో ప్రభుత్వం రూపొందించిన కోవిడ్ 19 గైడ్‌లైన్స్‌కు అనుగుణంగానే ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. (image: Indian Railways)
5. ఇక కొద్ది రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో రెస్టారెంట్ ఆన్ వీల్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. పశ్చిమ మధ్య రైల్వే ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్లో, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో కూడా ఇలాంటి రెస్టారెంట్లు ప్రారంభమయ్యాయి. (image: Indian Railways)
6. భారతీయ రైల్వే పాత రైలు బోగీలను రెస్టారెంట్లుగా మారుస్తోంది. ప్రయాణికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల్ని ఆకట్టుకోవడం కోసం ఈ కొత్త కాన్సెప్ట్ ఫాలో అవుతోంది. ప్రైవేట్ సంస్థలతో కలిసి వీటిని నిర్వహిస్తోంది. మరిన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా ఈ రెస్టారెంట్స్ అందుబాటులోకి రానున్నాయి. (image: Indian Railways)
7. రెస్టారెంట్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్‌కు మంచి క్రేజ్ లభిస్తోంది. పర్యాటకులు, రైల్వే ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతీ రెస్టారెంట్ ద్వారా ప్రతీ ఏటా రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని భారతీయ రైల్వే అంచనా వేస్తోంది. (image: Indian Railways)