వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్ లో ప్రత్యక్షమవుతుంది. ప్రస్తుతం వాట్సాప్ లేకుండా.. స్మార్ట్ ఫోన్ అనేదే లేదు. దీనిని వాడే వారి సంఖ్య కోట్లల్లో ఉంటుంది. ఒకప్పుడు వాట్సాప్ ద్వారా కేవలం వీడియోలు, ఫొటోలు మాత్రమే పంపించుకునే వీలు ఉండేది. కానీ తర్వాత ఎన్నో ఫీచర్లను అందులో జోడించారు. దీని ద్వారా యూపీఐ మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునే విధంగా.. కొత్త ఫీచర్ ను తీసుకొచ్చారు.
వాట్సాప్ టు వాట్సాప్ డబ్బులను పంపించుకోవచ్చు. ఇదిలా ఉండగా.. రైల్వే శాఖ వాట్సాప్ వాడుతున్న ప్రతీ ఒక్కరికీ శుభవార్త చెప్పింది. రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అదీ కూడా వాట్సాప్ ద్వారా. వాట్సాప్ వల్ల ఈ రకమైన ప్రయోజనం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే. అయితే దీనిని ఎలా ఆర్డర్ చేసుకోవాలి.. దానికి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ అవకాశాన్ని అందరికీ కల్పించలేదు. e- టికెట్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇందు కోసం రైల్వేస్ బిజినెస్ వాట్సాప్ నెంబర్ +91-8750001323ని స్టార్ట్ చేసింది. ఇండియన్ రైల్వేస్ కు సంబంధించిన పీఎస్ యు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) సోమవారం తన ఇ కేటరింగ్ సేవలను స్టార్ట్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
భారతీయ రైల్వే , టికెట్ ఎక్స్టెండ్ సర్వీస్, టికెట్ బుకింగ్ రూల్స్, టికెట్ బుకింగ్ నియమనిబంధనలు" width="1200" height="900" /> కస్టమర్లు ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేకుండా.. IRCTC ఇ- క్యాటరింగ్ వెబ్సైట్ www.ecatering.irctc.co.in ద్వారా.. స్టేషన్లకు సమీపంలోని తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి కస్టమర్ల ఫీడ్‌బ్యాక్, సూచనలను బట్టి.. ఎంపిక చేసిన కొన్ని ట్రైన్లలో మాత్రమే ఈ వాట్సాప్ ఫుడ్ డెలివరీ సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ స్పష్టం చేసింది. తదుపరి దశలో దీనిని మరిన్ని రైళ్లకు విస్తరించే యోచనలో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఐఆర్సీటీసీ రూపే క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్సీ ఐఆర్సీటీసీ క్రెడిట్ కార్డ్, ఐఆర్సీటీసీ రూపే క్రెడిట్ కార్డ్, ఐఆర్సీటీసీ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, ట్రైన్ టికెట్ బుకింగ్" width="1200" height="800" /> 3. దీని తర్వాత.. వాట్సాప్ నంబర్ టూ వే కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌గా ప్రారంభించబడుతుంది. AI పవర్ చాట్‌బాట్ ప్రయాణీకుల కోసం ఇ-కేటరింగ్ సేవలకు సంబంధించిన అన్ని ప్రశ్నలను సమాధానాలు ఇస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
IRCTC యొక్క ఈ-కేటరింగ్ సేవల ద్వారా వినియోగదారులకు రోజుకు దాదాపు 50,000 భోజనాలు అందిస్తున్నట్లు రైల్వే తన ప్రకటనలో పేర్కొంది. గత సంవత్సరం.. రైలులో ప్రయాణీకులకు ఆహారాన్ని పంపిణీ చేయడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ జూప్(Zoop) ఇండియా వాట్సాప్ చాట్‌బాట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ హాప్టిక్ టెక్నాలజీస్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. (ప్రతీకాత్మక చిత్రం