INDIAN RAILWAYS INCREASED PLATFORM TICKET RATE DURING SANKRANTI FESTIVAL NS
Indian Railways: పండుగ పూట రైల్వే ప్రయాణికులకు భారీ షాక్.. ఆ టికెట్ ధర డబుల్.. వివరాలివే
సంక్రాంతి (Sankranti) పూట ఇండియన్ రైల్వే (Indian Railway) ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఆ టికెట్ ధరను ఏకంగా రెట్టింపు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సంక్రాంతి సందర్భంగా సొంత ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే భారీగా స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగల్లో ఒకటి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా స్పెషల్ ట్రైన్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అనేక ట్రైన్లను ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
అయితే ఇంత వరకు భాగానే ఉన్నా.. ప్లాట్ ఫాం టికెట్ ధరల విషయంలో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఇప్పటి వరకు రూ. 10గా ఉన్న ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ. 20కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
సంక్రాంతి సందర్భంగా భారీగా ప్రయాణికులు స్టేషన్లోకి వస్తారు. అయితే ఈ సందర్భంగా భారీగా రద్దీ ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అనవసర రద్దీని తగ్గించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
దీంతో పాటు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ సమయంలో అధికంగా ప్రజలు గుమి కూడితే వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టేషన్లలో రద్దీని నివారించడానికి కూడా ఈ ప్లాట్ ఫాం టికెట్ల ధర పెంపు ఉపయోగపడుతుందని దక్షిణ మధ్య రైల్వే చెబుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ఈ ప్లాట్ ఫాం టికెట్ల ధరల పెంపు జవనరి 8వ తేదీ నుంచి జవనరి 20వ తేదీ వరకు అమలులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
అయితే.. ప్రస్తుతం ఈ టికెట్ల పెంపును కాచిగూడ స్టేషన్లో మాత్రమే అమలు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే.. పరిస్థితులు, రద్దీ దృష్ట్యా ఈ టికెట్ల పెంపును ఇతర స్టేషన్లకు కూడా వర్తింపజేసే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
రైల్వే ప్రయాణికులు మాత్రం ఈ ప్లాట్ ఫాం టికెట్ల ధరను ఏకంగా డబల్ చేయడంపై అసంతృప్తి చేస్తున్నారు.(ఫొటో: ట్విట్టర్)