1. భారతీయ రైల్వే 2019-20 సంవత్సరంలో రైల్వే ప్రయాణికులకు రూ.59,837 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. రైలులో ప్రయాణించే ప్రతీ వ్యక్తికి సగటున 53 శాతం రాయితీ వస్తుందని ఆయన తెలిపారు. దివ్యాంగులు, విద్యార్థులు, రోగులు.. ఇలా అనేక వర్గాలకు ఇప్పటికీ రైలు టికెట్లపై రాయితీలు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కరోనా వైరస్ మహమ్మారి కాలంలో భారతీయ రైల్వే రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే వృద్ధులకు రైలు టికెట్లపై రాయితీ తొలగించారు. ఆ తర్వాత కన్సెషన్ను రీస్టోర్ చేయలేదు. మరి 60 ఏళ్లు పైబడిన వారికి గతంలో ఇచ్చిన రాయితీని పునరుద్ధరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందా లేదా అన్న విషయాన్ని రైల్వే మంత్రి స్పష్టం చేయలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. కనీసం స్లీపర్, థర్డ్ ఏసీలలో సీనియర్ సిటిజన్లకు రాయితీని సమీక్షించి, పరిశీలించాలని స్టాండింగ్ కమిటీ సూచించిందని, 2019-20లో ప్రయాణీకుల టిక్కెట్లపై ప్రభుత్వం 59,837 కోట్ల రూపాయల సబ్సిడీని ఇచ్చిందని, ఇది రైల్వేలో ప్రయాణించే ప్రతి వ్యక్తికి సగటున 53 శాతం రాయితీ అని రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం నాలుగు కేటగిరీల దివ్యాంగులు, 11 కేటగిరీల రోగులు, విద్యార్థులకు రైలు ఛార్జీల్లో రాయితీ లభిస్తోందని రైల్వే మంత్రి తెలిపారు. 2019 మరియు 2022 మధ్య, దివ్యాంగులైన ప్రయాణికులకు రాయితీ కోసం రూ. 209 కోట్లు, రోగులకు రూ.221 కోట్లు, విద్యార్థులకు రూ.60 కోట్ల రాయితీ ఇచ్చినట్టు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరిస్తుందా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. కనీసం స్లీపర్, థర్డ్ ఏసీ క్లాస్లల్లో ప్రయాణించే వృద్ధులకైనా రైలు టికెట్లలో రాయితీ ఇవ్వాలంటూ పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)