1. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఇండియన్ రైల్వేస్ (Indian Railways) రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపింది. రైళ్ల సంఖ్యను పెంచుతూ ఇప్పుడు పూర్తి స్థాయిలో ట్రైన్స్‌ని నడుపుతోంది. అయితే కరోనా సమయంలో రైళ్లను నిలిపివేసినప్పటి నుంచి సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై కన్సెషన్ లభించట్లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అంటే వృద్ధులకు రైలు టికెట్లలో రాయితీ 2020 మార్చిలో నిలిచిపోయింది. రాయితీని పునరుద్ధరిస్తారని సీనియర్ సిటిజన్లు ఎదురుచూసినా నిరాశే మిగిలింది. తిరిగి కన్సెషన్‌ను అమలు చేసే ఆలోచనలో లేనట్టు కేంద్ర మంత్రి సైతం స్పష్టం చేశారు. దీంతో ఇక వృద్ధులకు రైలు టికెట్లలో రాయితీ రాదని తేలిపోయింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ అందుకున్న డెబిట్ క్లెయిమ్‌ల బిల్లులు, ప్రాసెసింగ్ కోసం MSA బ్రాంచ్‌కి ఫార్వార్డ్ చేయబడతాయని, రికార్డుల ప్రకారం, ఎంపీలు మరియు మాజీ ఎంపీల డెబిట్ క్లెయిమ్‌ల బిల్లులు MSA బ్రాంచ్ ద్వారా ప్రాసెస్ చేయబడ్డాయని లోక్‌సభ సెక్రెటేరియట్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐదేళ్లుగా ఎంపీలు, మాజీ ఎంపీలకు ఇచ్చిన రాయితీల వివరాలు చూస్తే 2017-18 సంవత్సరంలో రూ.19.34 కోట్లు, 2018-19 సంవత్సరంలో రూ.19.75 కోట్లు, 2019-20 సంవత్సరంలో రూ.16.4 కోట్లు, 2020-21 సంవత్సరంలో రూ.2.47 కోట్లు, 2021-22 సంవత్సరంలో రూ.3.99 కోట్ల రాయితీ ఇచ్చినట్టు తేలింది. గత ఐదేళ్లలో పోలిస్తే కరోనా వైరస్ ప్రభావం ఉన్న రెండేళ్లలో ఎంపీలు, మాజీ ఎంపీలకు రైలు టికెట్లపై ఇచ్చిన రాయితీ తక్కువగానే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై రాయితీ నిలిపివేయడం ద్వారా భారతీయ రైల్వే రూ.1,500 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందినట్టు గతంలో కూడా ఆర్టీఐ సమాధానం ద్వారా తెలిసింది. గతంలో భారతీయ రైల్వే 58 ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం, 60 ఏళ్లు దాటిన పురుషులు, ట్రాన్స్జెండర్లకు 40 శాతం కన్సెషన్ ఇచ్చేది. (ప్రతీకాత్మక చిత్రం)
7. భారతీయ రైల్వే కన్సెషన్స్ని రీస్టోర్ చేస్తుందేమోనని ఆ వర్గాల రైల్వే ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. కానీ... భారతీయ రైల్వే కన్సెషన్స్ని రీస్టోర్ చేసే పరిస్థితి లేదు. కన్సెషన్స్ని తిరిగి అమలు చేసే ఆలోచనలో లేనట్టు భారతీయ రైల్వే పలు సందర్భాల్లో తెలిపింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)