1. గతంలో భారతీయ రైల్వే వేర్వేరు వర్గాలకు రైలు టికెట్లలో కన్సెషన్ (Railway Concession) అంటే తగ్గింపు అందించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ మహమ్మారి విజృంభించినప్పుడు భారతీయ రైల్వే 2020 మార్చి 20న రైళ్లను నిలిపివేసింది. ఆ తర్వాత దశలవారీగా రైల్వే సేవల్ని అందించింది. అన్ని రూట్లలో రైళ్లను పునరుద్ధరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత రైల్వే పూర్తి స్థాయిలో రైళ్లను పునరుద్ధరించినా రైల్వే టికెట్లపై కన్సెషన్‌ను మాత్రం తిరిగి అమలు చేయలేదు. మొదట అన్నీ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారన్న కారణంతో కన్సెషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత కోవిడ్ 19 ముందు లాగానే రైళ్లు నడుపుతున్నా కన్సెషన్ రీస్టోర్ చేయలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. భారతీయ రైల్వే 2020 మార్చి 20 నుంచి 2022 మార్చి 31 వరకు కన్సెషన్ తొలగించడం ద్వారా అదనంగా ఎంత ఆదాయాన్ని ఆర్జించింది అన్న విషయం తెలుసుకోవడానికి మధ్య ప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టుం ద్వారా వివరాల కోసం దరఖాస్తు చేశారు. ఈ రెండేళ్లలో రైల్వే 7.31 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు కన్సెషన్ ఇవ్వలేదని తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. గతంలో భారతీయ రైల్వే 58 ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం, 60 ఏళ్లు దాటిన పురుషులు, ట్రాన్స్జెండర్లకు 40 శాతం కన్సెషన్ ఇచ్చేది. రెండేళ్లలో 4.46 కోట్ల పురుషులకు, 2.84 కోట్ల మహిళలకు, 8,310 ట్రాన్స్జెండర్లకు కన్సెషన్ ఇవ్వలేదు. వీరు తమ రైల్వే ప్రయాణం కోసం రూ.3,464 కోట్ల ఛార్జీలు చెల్లించారు. పురుషులు రూ.2,082 కోట్లు, మహిళలు రూ.1,381 కోట్లు, ట్రాన్స్జెండర్లు రూ.45.58 లక్షల ఛార్జీలు చెల్లించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. సీనియర్ సిటిజన్లకు కన్సెషన్ నిలిపివేయడం ద్వారా భారతీయ రైల్వేకు అదనంగా రూ.1,500 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆర్టీఐ సమాధానం ద్వారా తెలిపింది రైల్వే. మరి భారతీయ రైల్వే కన్సెషన్స్ని ఎప్పుడు రీస్టోర్ చేస్తుందా అని రైల్వే ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. కానీ... భారతీయ రైల్వే కన్సెషన్స్ని రీస్టోర్ చేసే పరిస్థితి లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. కన్సెషన్స్ని తిరిగి అమలు చేసే ఆలోచనలో లేనట్టు భారతీయ రైల్వే పలు సందర్భాల్లో తెలిపింది. రైల్వే ఇచ్చే కన్సెషన్స్ తొలగించాలంటే పలు కమిటీలు కూడా సిఫార్సు చేశాయి. 53 రకాల కన్సెషన్స్తో భారతీయ రైల్వేకు రూ.2,000 కోట్లకు పైగా అదనపు భారం పడుతోంది. మొత్తం డిస్కౌంట్లలో 80 శాతానికి పైగా సీనియర్ సిటిజన్లకు ఇస్తున్నవే. (ప్రతీకాత్మక చిత్రం)
7. అయితే 2016 జూలైలో వృద్ధులు రైల్వే కన్సెషన్ తీసుకోవడం ఆప్షనల్‌గా మార్చారు. 'గివ్ ఇట్ అప్' కార్యక్రమం ద్వారా స్వచ్ఛందంగా కన్సెషన్ వదులుకోవాలని రైల్వే కోరింది. కానీ ఈ ప్రయత్నం అంతగా ఫలించలేదు. 'గివ్ ఇట్ అప్' స్కీమ్ ఫలితాన్ని ఇవ్వట్లేదని 2019లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక కూడా తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)