ఇప్పటి వరకు సాధారణ యూజర్ ఐడీ ద్వారా నెలలో ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. ఒకే నెలలో ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వచ్చినా.. శుభకార్యాలకు, పుణ్యక్షేత్రాలకు, టూర్లకు వెళ్లాలనుకుంటున్న వారు.. టికెట్లను ఎక్కువ సంఖ్యలో బుక్ చేసుకోవడానికి ఇబ్బంది పడేవారు ప్రయాణికులు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో వివిధ ఐడీల నుంచి, తెలిసిన వారి ఐడీల నుంచి టికెట్లను బుక్ చేసుకునే వారు.అయితే, ఆధార్ లింక్డ్ యూజర్ ఐడీతో 12 నుంచి 24 టికెట్లు బుక్ చేసుకునేందుకు వెసులుబాటు లభించడంతో అలాంటి వారికి ఇబ్బందులు తప్పాయి. వారంతా ఇప్పుడు ఒక్క ఐడీతోనే కుటుంబ సభ్యులందరికీ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం లభించడంతో ఊరట లభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఏసీ ఫస్ట్ క్లాస్లో 70 కిలోల వరకు ఉచితం. ఏసీ2-టైర్లో 50 కిలోలు, ఏసీ 3-టైర్ స్లీపర్, ఏసీ చైర్ కార్, స్లీపర్ క్లాస్ల్లో 40 కిలోల బ్యాగేజీ వరకు అనుమతి ఉంటుందని రైల్వే తెలిపింది. క్లాస్-2 ప్రయాణికులు 25 కిలోల వరకు లగేజీని ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. లగేజీపై కనిష్ఠ చార్జీ రూ.30గా ఖరారు చేసింది రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)