Sankranti Special Trains: పండుగ పూట రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏపీ, తెలంగాణ మధ్య మరో 8 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్
Sankranti Special Trains: పండుగ పూట రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏపీ, తెలంగాణ మధ్య మరో 8 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్
సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే అనేక ప్రత్యేక రైళ్లను (Sankranti Special Trains) ప్రకటించిన అధికారులు తాజాగా మరో 8 స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించారు. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1/ 8
Train No.82727: కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (Suvidha Spl) ఈ ట్రైన్ ను ఈ నెల 16న నడపనున్నారు. ఈ రైలు 21 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 8.55 గంటలకు గమ్యానికి చేరుతుంది.
2/ 8
Train No 07537: కాకినాడ టౌన్-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 18న నడపనున్నారు. ఈ రైలు కూడా 21 గంటలకు బయలు దేరి మరుసటి రోజు 8.55 గంటలకు గమ్యానికి చేరుతుంది.
3/ 8
Train No.07496: నర్సాపూర్-వికారాబాద్(One Way) ఈ ట్రైన్ ను ఈ నెల 16, 18 తేదీల్లో నడపనున్నారు. ఈ రైలు ఆయా తేదీల్లో 20.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 09.25 గంటలకు గమ్యానికి చేరుతుంది.
4/ 8
Train No.07298: మచిలీపట్నం-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 17, 19 తేదీల్లో నడపనున్నారు. ఈ రైలు ఆయా తేదీల్లో 21.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 06.50 గంటలకు గమ్యానికి చేరుతుంది.
5/ 8
Train No.07089: నర్సాపూర్-వికారాబాద్ (జనసాధరణ్ స్పెషల్) ఈ ట్రైన్ ను ఈ నెల 17న నడపనుంది సౌత్ సెంట్రల్ రైల్వే. 10 గంటలకు బయలుదేరి అదే రోజు 23.20 గంటలకు గమ్యానికి చేరుతుంది.
6/ 8
Train No.07436:అనకాపల్లె-సికింద్రాబాద్(జనసాధరణ్ స్పెషల్) ట్రైన్ ను ఈ నెల 16న నడపనున్నారు. ఈ ట్రైన్ 19 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 09.50 గంటలకు గమ్యానికి చేరుతుంది.
7/ 8
Train No 07437: తిరుపతి-సికింద్రాబాద్ (జనసాధరణ్ స్పెషల్) ఈ ట్రైన్ ను ఈ నెల 17న నడపనున్నారు. ఈ రైలు 08.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 08.00 గంటలకు గమ్యానికి చేరుతుంది.
8/ 8
Train No.07539: కాకినాడ టౌన్-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 17న నడపనున్నారు. ఈ రైలు 21.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 08:55 గంటలకు గమ్యానికి చేరుతుంది.