Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే
Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే(South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు ప్రత్యేక రైళ్లను(Special Trains) ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
Train No. 08585: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు ఈ నెల 16, 23 తేదీల్లో వీక్లీ స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ 17.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 07.10 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
Train No. 08586: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ట్రైన్ ఈ నెల 17, 24 తేదీల్లో వీక్లీ స్పెషల్ ట్రైన్లు నడపనున్నారు. ఈ ట్రైన్లు 21.05 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు 09.50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిపే వీక్లీ స్పెషన్ ట్రైన్లు దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ఫొటో: ట్విట్టర్)
5/ 8
Train No.07506: హెచ్.ఎస్. నాందేడ్ నుంచి బీదర్ కు ఈ నెల 18న ప్రత్యేక ట్రైన్ నడపనున్నారు. ఈ ట్రైన్ 11. 50 గంటలకు బయలుదేరి.. అదే రోజు 18.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
Train No 07507: బీదర్-హెచ్.ఎస్.నాందేడ్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 20న నడపనున్నారు. ఈ ట్రైన్ 14 గంటలకు బయలుదేరి.. 20.40 గంటలకు గమ్యానికి చేరనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
Train No. 02575: హైదరాబాద్-గోరఖ్పూర్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 12న నడపనున్నారు. ఈ ట్రైన్ 21.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 06.30 గంటలకు గమ్యానికి చేరనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
Train No. 02576: గోరఖ్పూర్-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 14న నడపనున్నారు. ఈ ట్రైన్ 08.30 గంటలకు బయలుదేరి.. 15.20 గంటలకు గమ్యానికి చేరనుంది.(ఫొటో: ట్విట్టర్)