1. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) జనవరి 15న సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలును ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య పరుగులు తీయనున్న వందే భారత్ రైలు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఛార్జీలను కూడా ప్రకటించింది భారతీయ రైల్వే. ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లో సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలును బుక్ చేయొచ్చు. ఈ రైలు దారిలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. సికింద్రాబాద్-విశాఖపట్నం ఛార్జీలను ప్రకటించింది భారతీయ రైల్వే. ఏసీ ఛైర్ కార్ ఛార్జీల వివరాలు చూస్తే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు రూ.1,720, విశాఖపట్నం నుంచి రాజమండ్రికి రూ.625, విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్‌కు రూ.960, విశాఖపట్నం నుంచి ఖమ్మం వరకు రూ.1,115, విశాఖపట్నం నుంచి వరంగల్‌కు రూ.1,310 ఛార్జీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం రూట్లో ఏసీ ఛైర్ కార్ ఛార్జీల వివరాలు చూస్తే రూ.1,665, సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు రూ.520, సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు రూ.750, సికింద్రాబాద్ నుంచి విజయవాడ రూట్లో రూ.905, సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి వరకు రూ.1,365 చొప్పున ఛార్జీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం రూట్లో ఎగ్జిక్యూటీవ్ ఛైర్ కార్ ఛార్జీల వివరాలు చూస్తే రూ.3,120, సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు రూ.1005, సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు రూ.1460, సికింద్రాబాద్ నుంచి విజయవాడ రూట్లో రూ.1775, సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి వరకు రూ.2,485 చొప్పున ఛార్జీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9. వందే భారత్ రైలు విశేషాలు చూస్తే భారతీయ రైల్వే తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును 2019లో ప్రారంభించింది. ఇప్పటి వరకు ఏడు వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా, న్యూ ఢిల్లీ-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్-గాంధీ నగర్, మైసూర్-చెన్నై, నాగ్‌పూర్-బిలాస్పూర్, హౌరా-న్యూజల్పాయ్గురి రూట్లల్లో వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)