Special Train: ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు మరో ప్రత్యేక రైలు... టైమింగ్స్, రూట్ వివరాలివే
Special Train: ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు మరో ప్రత్యేక రైలు... టైమింగ్స్, రూట్ వివరాలివే
Special Train | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు మరో ప్రత్యేక రైలును ప్రకటించింది భారతీయ రైల్వే. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. దేశ రాజధాని న్యూ ఢిల్లీ నుంచి హైదరాబాద్ ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. న్యూ ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు మరో స్పెషల్ రాజధాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించింది రైల్వే. ప్రతీ ఆదివారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. ఈ రైలు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణిస్తుంది. ఢిల్లీ నుంచి తెలంగాణకు రావాలనుకునే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైలు ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. రైలు నెంబర్ 02438 రాజధాని స్పెషల్ రైలు హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 3.35 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1.35 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. ఈ రైలులో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.2,065, సెకండ్ ఏసీ టికెట్ ధర రూ.2,960, ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ ధర రూ.5,060. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. ఈ రైలు హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో బయల్దేరి దారిలో ఝాన్సీ, భోపాల్ జంక్షన్, నాగ్‌పూర్, బల్లార్షా, కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. రాజధాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్లను ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్‌లో బుక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. ఇక మరో రెండు నెలల్లో మొత్తం ప్యాసింజర్ రైళ్లన్నీ కోవిడ్ కన్నా ముందు ఉన్నట్టుగా రైల్వే నడపనుందన్న వార్తలు గతంలో వచ్చాయి. కానీ ఇటీవల కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో రైళ్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియదు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. ప్రస్తుతం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లో 66 శాతం రైళ్లు నడుస్తున్నాయని అంచనా. దశల వారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది భారతీయ రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)