INDIAN RAILWAYS ANNOUNCED HOLI SPECIAL TRAINS BETWEEN SECUNDERABAD KAKINADA TOWN TIRUPATI STATIONS HERE DETAILS NS
Special Trains: సికింద్రాబాద్-ఏపీ మధ్య 4 హోళీ స్పెషల్ ట్రైన్స్.. డేట్స్, టైమింగ్స్ వివరాలివే
Holi Special Trains: దక్షిణ మధ్య రైల్వే(SCR) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హోళీ పండుగ సందర్భంగా తెలంగాణ, ఏపీ మధ్య 4 స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07053: సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 17న నడపనున్నారు. ఈ రైలు ఆ తేదీన రాత్రి 8.45 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు గమ్యానికి చేరుకోనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఈ ట్రైన్ కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
Train No.07054: కాకినాడ టౌన్-వికారాబాద్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 20న నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ ఆ రోజు రాత్రి 8.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు గమ్యానికి చేరనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Train No.02764: సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 17న నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ ఆ రోజు సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 గంటలకు గమ్యానికి చేరనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ఈ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
Train No.02763: తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 20న నడపనున్నారు. ఈ ట్రైన్ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు గమ్యానికి చేరనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఈ ట్రైన్ రేణిగుంట, శ్రీకాళహస్తీ, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట మరియు జనగాం స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు. (ఫొటో: ట్విట్టర్)