Diwali Special Trains: దీపావళికి తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే..
Diwali Special Trains: దీపావళికి తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే..
దీపావళి(Diwali 2021) పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పలు స్పెషల్ ట్రైన్ల(Special Trains)ను ప్రకటించింది. ఆయా ట్రైన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
దీపావళి (Diwali 2021)సందర్భంగా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పలు ప్రాంతాల మధ్య స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
Train No: 07455: నర్సాపూర్-సికింద్రాబాద్ కు ఈ నెల 31, నవంబర్ 7, 14 తేదీల్లో ప్రత్యేక ట్రైన్ ను నడపనున్నట్లు తెలిపింది. ఈ ట్రైన్ 18.00 గంటలకు నర్సాపూర్ లో మొదటై మరుసటి రోజు ఉదయం 04.10 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
ఈ ట్రైన్ పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడురురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
Train No 07456: సికింద్రాబాద్ నుంచి విజయవాడ కు నవంబర్ 1, 8, 15 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపున్నారు. ఈ ట్రైన్ 22.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
ఈ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు స్టేషన్లలో ఆగుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
Train No. 07460: సికింద్రాబాద్ నుంచి దానాపూర్ కు నవంబర్ 7న ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ ట్రైన్ ఉదయం 05.50 గంటలకు సికింద్రాబాద్ లో ప్రారంభమై.. మరుసటి రోజు 12.45 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
Train No. 07459: దానాపూర్ నుంచి సికింద్రాబాద్ కు నవంబర్ 11న ప్రత్యేక రైలును నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 11 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 18.30 నిమిషాలకు గమ్యం చేరుకుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
ఈ రెండు ట్రైన్లు కాజీపేట, రామగుండం, సిర్ పూర్ కాగజ్ నగర్, బలర్షా, నాగపూర్ తదితర స్టేషన్లలో ఆగుతాయి.(ప్రతీకాత్మక చిత్రం)