1. విశాఖపట్నం నుంచి కొల్లాం రూట్లో 7 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రైలు నెంబర్ 08567 డిసెంబర్ 4, 11, 18, 25 తేదీలతో పాటు 2023 జనవరి 1, 8, 15 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నంలో ఆదివారం ఉదయం 7.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కొల్లాం నుంచి విశాఖపట్నం రూట్లో 7 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రైలు నెంబర్ 08568 డిసెంబర్ 5, 12, 19, 26 తేదీలతో పాటు 2023 జనవరి 2, 9, 16 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కొల్లాంలో సోమవారం రాత్రి 8.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. విశాఖపట్నం-కొల్లాం రూట్లో ప్రయాణించే రైలు దారిలో దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి జంక్షన్, జోలార్పెట్టై జంక్షన్, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూర్, కొయంబత్తూర్ జంక్షన్, పాలక్కాడ్ జంక్షన్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనస్సెరి, తిరువల్ల, చెంగన్నూర్, మళికెర, కన్యాకుళం, శాస్థాన్కోట స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. విశాఖపట్నం-కొల్లాం రూట్లో ప్రయాణించే 14 ప్రత్యేక రైళ్లల్లో 4 ఏసీ 2 టైర్ కోచ్లు, 10 ఏసీ 3 టైర్ కోచ్లు, 2 స్లీపర్ క్లాస్ కోచ్లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, 1 లగేజ్ బ్రేక్, జనరేటర్ వ్యాన్, దివ్యాంగుల కోసం 1 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. ఈ వీక్లీ స్పెషల్ ఫేర్ రైళ్ల అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రారంభమైంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి శబరిమలకు 40 పైగా ప్రత్యేక రైళ్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రైళ్లు అయ్యప్ప భక్తులకు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి కొల్లాం మధ్య డిసెంబర్ 4, 11, 25, 18 తేదీలతో పాటు 2023 జనవరి1, 8, 15న, కొల్లాం నుంచి సికింద్రాబాద్కు డిసెంబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు 2023 జనవరి 3, 10, 17న ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక హైదరాబాద్ నుంచి కొల్లాం వరకు డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో, 2023 జనవరి 3, 10 తేదీల్లో, కొల్లాం నుంచి హైదరాబాద్కు డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో, 2023 జనవరి 4, 11 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అయ్యప్ప భక్తుల కోసం భారతీయ రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్ కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)