Sankranti Special Trains: హైదరాబాద్-ఏపీ మధ్య మరో పది సంక్రాంతి స్పెషల్ రైళ్లు.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే
Sankranti Special Trains: హైదరాబాద్-ఏపీ మధ్య మరో పది సంక్రాంతి స్పెషల్ రైళ్లు.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగైన సంక్రాంతి సందర్భంగా ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఇటీవల వరుసగా స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. తాజాగా మరో 10 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Train No 07497: కాచీగూడ-విశాఖపట్నం మధ్య ఈ నెల 7, 14న స్పెషల్ ట్రైన్లను నడపనున్నారు. ఈ రైళ్లు ఆయా తేదీల్లో రాత్రి 9 గంటలకు బయలు దేరి.. మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు గమ్యానికి చేరుతాయి.
2/ 9
Train No 07498: విశాఖపట్నం-కాచీగూడ మధ్య ఈ నెల 8, 16 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఆ రైళ్లు ఆ తేదీల్లో సాయంత్రం 7 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యానికి చేరుతాయి.
3/ 9
Train No 82716: కాచీగూడ-నర్సాపూర్ ట్రైన్ ను ఈ నెల 11న నడపనున్నారు. ఆ ట్రైన్ రాత్రి 23.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.40 గంటలకు గమ్యానికి చేరుతాయి.
4/ 9
6.Train No 07494: నర్సాపూర్-కాచీగూడ మధ్య ఈ నెల 12న ప్రత్యేక రైలును నడపనున్నారు. ఆ రైలు ఆ తేదీన సాయంత్రం 6 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు గమ్యానికి చేరుతుంది.
5/ 9
Train No 07491: కాచీగూడ టౌన్-లింగపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ఈ నెల 19, 20 తేదీల్లో నడపనున్నారు. ఈ రైళ్లు ఆ తేదీల్లో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు గమ్యానికి చేరుతుంది.
6/ 9
Train No 07492: లింగంపల్లి-కాకినాడ టౌన్ ను ఈ నెల 20, 22 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ ఆ తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు గమ్యానికి చేరుతుంది.