1. భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో కొత్త సర్వీస్ ప్రారంభించింది. రైల్వే స్టేషన్లలో ఉండే ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) ద్వారా డిజిటల్ టికెటింగ్ సర్వీసెస్ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రైల్వే ప్రయాణికులకు పేమెంట్ సేవల్ని అందించేందుకు ఐఆర్సీటీసీతో పేటీఎం (Paytm) ఒప్పందం కుదుర్చుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్‌లో పేటీఎం యూజర్లు క్యూఆర్ కోడ్ పేమెంట్స్ చేయొచ్చు. ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్‌లో టికెట్స్ తీసుకునే ప్రయాణికులు క్యాష్‌లెస్ పేమెంట్స్ చేసేలా ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే తొలిసారిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపే అవకాశం కల్పిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. భారతదేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ ద్వారా ట్రైన్ టికెట్స్ తీసుకునే ప్రయాణికులు పేటీఎం ద్వారా క్యూఆర్ కోడ్ పేమెంట్స్ చేయొచ్చు. గతంలో రైల్వే స్టేషన్లో టికెట్లు తీసుకోవడానికి టికెట్ కౌంటర్ల దగ్గర భారీ క్యూ కట్టాల్సి వచ్చేది. కానీ ఆ అవసరం లేకుండా ప్రయాణికులే స్వయంగా రైలు టికెట్లు తీసుకోవడానికి ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ ఏర్పాటు చేసింది భారతీయ రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ మెషీన్స్ ద్వారా ప్రయాణికులు ప్రయాణ టికెట్లతో పాటు ప్లాట్‌ఫామ్ టికెట్స్ తీసుకోవచ్చు. సీజన్ టికెట్స్ తీసుకోవడంతో పాటు స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడు పేటీఎం యూజర్లు పేటీఎం యూపీఐ, పేటీఎం వ్యాలెట్, పేటీఎం పోస్ట్‌పెయిడ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇప్పటికే రైల్వే ప్రయాణికులు ట్రైన్ టికెట్ బుకింగ్ యాప్‌లో పేమెంట్స్‌తో పాటు, ఇ-కేటరింగ్ సర్వీసుల కోసం పేటీఎం ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పుడు ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్‌లో తీసుకునే టికెట్లకు కూడా పేటీఎం క్యూఆర్ కోడ్ యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. ఈ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. స్క్రీన్ పైన డిస్ప్లే అయిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ప్రయాణికులు ఫిజికల్ టికెట్ తీసుకోవచ్చు లేదా స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ చేయొచ్చు. రైల్వే ప్రయాణికులు డిజిటల్ పద్ధతిలో టికెట్లు బుక్ చేయడం కోసం భారతీయ రైల్వేతో పాటు ఐఆర్సీటీసీ ఇలాంటి చర్యలు తీసుకుంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)