బ్యాంక్ వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. 7 నుంచి ఏడాది కాల పరిమితిలోని ఎఫ్డీలపై 3.75 శాతం నుంచి 5.25 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్డీలపై అయితే 6.4 శాతం వడ్డీ వస్తుంది. 444 రోజుల ఎఫ్డీలపై 6.55 శాతం వడ్డీ పొందొచ్చు. 2 ఏళ్ల నుంచి మూడేళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేటు 6.4 శాతంగా ఉంది.
కర్నాటక బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుంచి ఏడాది టెన్యూర్‌లోని ఎఫ్డీలపై 5.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 555 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై అయితే 7.3 శాతం వడ్డీ రేటు ఉంది. ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్డీలపై 6.1 శాతం, రెండేళ్ల నుంచి ఐదేళ్ల ఎఫ్డీలపై 5.75 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్డీలపై 5.8శాతం వడ్డీ ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు 0.4 శాతం అధిక వడ్డీ వస్తుంది.
కాగా ఇప్పటికే ఎస్బీఐ దగ్గరి నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరకు చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేశాయి. అందువల్ల మీరు డబ్బులు దాచుకునే ముందు ఏ బ్యాంక్‌లో ఎక్కువ వడ్డీ ఉందో చెక్ చేసుకోవడం ఉత్తమం. ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం వల్ల అధిక రాబడి సొంతం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద పేరున్న బ్యాంకుల్లో ఎఫ్డీ చేయడం మంచిది.