Credit Card: కొత్త క్రెడిట్ కార్డు అదిరింది.. ప్రీగా 60 లీటర్ల పెట్రోల్, ఉచితంగా రూ.2 లక్షల బెనిఫిట్!
Credit Card: కొత్త క్రెడిట్ కార్డు అదిరింది.. ప్రీగా 60 లీటర్ల పెట్రోల్, ఉచితంగా రూ.2 లక్షల బెనిఫిట్!
Bank News | కొత్త క్రెడిట్ కార్డు కోసం చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మార్కెట్లోకి కొత్త కార్డు వచ్చింది. దీని ద్వారా 60 లీటర్ల పెట్రోలో ఫ్రీగా పొందొచ్చు.
Credit Card News | మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డు వచ్చింది. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో (Banks) ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా ఈ కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్లోకి తీసుకువచ్చింది.
2/ 10
బ్యాంక్ ఇండియన్ ఆయిల్ భాగస్వామ్యంతో ఈ కొత్త క్రెడిట్ కార్డును (Credit Card) తెచ్చింది. అంటే ఇది కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు. అలాగే వాహన దారులకు ఈ క్రెడిట్ కార్డు వల్ల చాలా బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు.
3/ 10
రూపే నెట్వర్క్ పైన ఈ ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డును తీసుకువచ్చారు. ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న వారికి అదిరే రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఇండియన్ ఆయిల్ ఫ్యూయెల్ స్టేషన్లో పెట్రోల్, డీజిల్ కొట్టించే వారికి ఈ కార్డు ద్వారా అధిక ప్రయోజనం లభిస్తుందని చెప్పుకోవచ్చు.
4/ 10
రివార్డు పాయింట్ల ద్వారా ఉచితంగానే పెట్రోల్ లేదా డీజిల్ పొందొచ్చు. ఇండియన్ ఆయిల్ ఫ్యూయెల్ స్టేషన్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తే.. 4 శాతం రివార్డు పాయింట్ల రూపంలో పొందొచ్చు. నెలకు రూ. 300 వరకు పొందొచ్చు.
5/ 10
డైనింగ్, గ్రాసరీ, ఇతర పేమెంట్లపై 2 శాతం రివార్డు పాయింట్లు లభిస్తాయి. నెలకు రూ. 200 వరకు పొందొచ్చు. సర్ చార్జ్ మినహాయింపు 1 శాతం లభిస్తుంది. నెలకు రూ. 100 వరకు ఈ బెనిఫిట్ ఉంటుంది. 48 రోజుల వరకు వడ్డీ రహిత కాలాన్ని పొందొచ్చు.
6/ 10
ఇంకా ఈ క్రెడిట్ కార్డుపై స్మార్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా ఉంటుంది. జీరో లాస్ట్ కార్డు లయబిలిటీ ప్రయోజనం పొందొచ్చు. ఇది కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు. అంటే ట్యాప్ అండ్ పే సర్వీసులు పొందొచ్చు. దేశంలో ఇండియన్ ఆయిల్ అనేది అతిపెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు.
7/ 10
దీనికి దేశవ్యాప్తంగా 34 వేలకు పైగా ఫ్యూయెల్ స్టేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఈ క్రెడిట్ కార్డు పొందడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ఎక్కడికీ వెళ్లినా పెట్రోల్ బంకులు ఉంటాయి. ఈజీగా ఫ్యూయెల్ కొట్టించుకోవచ్చు.
8/ 10
ఈ కొత్త క్రెడిట్ కార్డు ద్వారా ఏడాదికి 60 లీటర్ల పెట్రోల్ ఉచితంగ పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. కార్డు వార్షిక ఫీజు రూ. 499గా ఉంది. అలాగే జాయినింగ్ ఫీజు కూడా రూ. 499 ఉంటుంది.
9/ 10
ఇంకా ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా లభిస్తుంది. ఏడాదిలో రూ. 50 వేలకు పైగా ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మాఫీ లభిస్తుంది. యాడ్ ఆన్ కార్డు ఉచితంగా పొందొచ్చు. ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్ చేస్తే.. రూ. 300 చార్జీలు పడతాయి.
10/ 10
ఈ కొత్త ఇండియన్ ఆయిల్ కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు పొందాలని భావించే వారు బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు క్రెడిట్ కార్డు పొందటానికి అర్హులు.