1. మీరు గత రెండు మూడు రోజుల్లో ఇండేన్ గ్యాస్ బుక్ చేయడానికి ట్రై చేశారా? ఇండేన్ గ్యాస్ బుక్ (Indane Gas Booking) చేద్దామంటే ఎర్రర్ మెసేజ్ వచ్చిందా? ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇదే సమస్య ఎదురైందా? మీకే కాదు... వేలాది మంది కస్టమర్లకు ఇదే సమస్య ఎదురైంది. ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఎర్రర్ మెసేజ్ వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. గత రెండు రోజులుగా సాంకేతిక సమస్యల కారణంగా ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లో సమస్యలు ఎదురయ్యాయని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎల్పీజీ బుకింగ్, డెలివరీ సిస్టమ్‌ను నిర్వహిస్తున్న ఐబీఎం ఇండియా ఈ సమస్యను పరిష్కరించిందని ఐఓసీఎల్ తెలిపింది. ఐబీఎంతో పాటు ఒరాకిల్ ఈ సమస్యను పరిష్కరించినట్టు వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మీ బుకింగ్స్ రిజిస్టర్ చేస్తున్నామని, సిలిండర్లు డెలివరీ చేస్తామని ఐఓసీఎల్ ప్రకటించింది. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు 77189 55555 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపి లేదా ఐవీఆర్ఎస్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చని ఐఓసీఎల్ తెలిపింది. లేదా 84549 55555 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. ఇదే కాదు... 75888 88824 నెంబర్‌కు వాట్సప్ ద్వారా ఎస్ఎంఎస్ పంపి మీరు ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. కస్టమర్లు నేరుగా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. క్యాష్ మెమోపైన ఉండే నెంబర్లకు కాల్ చేసి కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసే అవకాశం ఉంటుంది. 5. భారతదేశంలో వంట గ్యాస్‌ను సరఫరా చేస్తున్న అతిపెద్ద సంస్థల్లో ఇండేన్ గ్యాస్ కూడా ఒకటి. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లతో పాటు 5 కిలోల చిన్న సిలిండర్, 19 కిలోల కమర్షియల్ సిలిండర్, 47.5 కిలోల భారీ సిలిండర్లను సరఫరా చేస్తోంది. 16 కోట్లకు పైగా ఇళ్లకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తోంది ఇండేన్ గ్యాస్. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీరు ఇండేన్ గ్యాస్ కస్టమర్ అయితే ఎస్ఎంఎస్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. ఇందుకోసం IOC అని టైప్ చేసి STD Code తో పాటు డిస్ట్రిబ్యూటర్ కాంటాక్ట్ నెంబర్, కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు డిస్ట్రిబ్యూటర్ హెల్ప్ లైన్ నెంబర్ 23110572, ఎస్టీడీ కోడ్ 040. కన్స్యూమర్ నెంబర్ 12345678 అనుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
6. అప్పుడు IOC 04023110572 12345678 అని టైప్ చేసి స్థానిక ఐవీఆర్ఎస్ నెంబర్‌కు మెసేజ్ పంపాల్సి ఉంటుంది. గతంలో ఐవీఆర్ఎస్ నెంబర్లు వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరుగా ఉండేవి. కానీ నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే ఐవీఆర్ఎస్ నెంబర్ 7718955555 ప్రారంభించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఆ తర్వాత నుంచి IOC అని టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఐవీఆర్ఎస్ నెంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు. సిలిండర్ బుక్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఒకవేళ మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నట్టైతే వాట్సప్‌లో ఓ మెసేజ్ పంపించడం ద్వారా ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. 7588888824 నెంబర్‌కు వాట్సప్ చేయాల్సి ఉంటుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్లో 7588888824 నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత ఇదే నెంబర్ సెర్చ్ చేసి ఛాట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Refill అని టైప్ చేసి మెసేజ్ పంపిస్తే చాలు సిలిండర్ బుక్ అవుతుంది. ఈ నెంబర్ 24 గంటలు పనిచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)