ఇండియన్ బ్యాంక్ ఇండ్ శక్తి 555 స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఒక విషయం తెలుసుకోవాలి. కనీసం రూ. 5 వేలు నుంచి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ. 2 కోట్ల వరకు డబ్బులు దాచుకోవచ్చు. ఈ కొత్త స్కీమ్ వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. సాధారణ ప్రజలకు 7 శాతం వడ్డీ వస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.15 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.
బ్యాంక్ ఎఫ్డీ రేట్లను గమనిస్తే.. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ 7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్డీలపై 2.8 శాతం వడ్డీని అందిస్తోంది. 30 రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 46 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్డీలపై 3.25 శాతం వడ్డీని అందుబాటులో ఉంచింది. 91 రోజుల నుంచి 120 రోజుల ఎఫ్డీలపై 3.5 శాతం వడ్డీ పొందొచ్చు.