జనవరి నుంచి కొన్ని రూల్స్ మారుతున్నాయి. వాటి గురించి తెలుసుకోవడం వినియోగదారులుగా మన బాధ్యత. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులు జనవరి1 నుంచి పరిమితి కంటే ఎక్కువ నగదును విత్డ్రా చేసినా లేక డిపాజిట్ చేసినా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ బ్యాంక్ డబ్బును డిపాజిట్ చేసినందుకు కూడా రుసుము విధిస్తారు. జనవరి 1 నుండి ఈ నియమం వర్తిస్తుంది. సాధారణ సేవింగ్స్ ఖాతా నుండి ప్రతి నెలా నాలుగు సార్లు నగదు విత్డ్రా చేసుకుంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఆ తర్వాత ప్రతి విత్డ్రావల్ లేదా డిపాజిట్ కోసం కస్టమర్లు కనీసం రూ.25 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో రుసుము లేకుండా ఒక నెలలో సేవింగ్స్, కరెంట్ ఖాతాలలో కేవలం రూ. 10,000 మాత్రమే డిపాజిట్ చేయొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
రూ. 10,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే మాత్రం వినియోగదారులు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో తన వెబ్సైట్లో పేర్కొంది.
5/ 6
పొదుపు ఖాతాతో పాటు ఇతర పొదుపు ఖాతాలు, కరెంట్ ఖాతాల్లో రూ. 10 వేల వరకు డిపాజిట్ చేయడానికి ఎటువంటి రుసుము ఉండదు. దీని తరువాత 0.50 శాతం రుసుము చెల్లించవలసి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఇది కనీసం 25 రూపాయలుగా ఉంటుంది. పొదుపు ఖాతా, కరెంట్ ఖాతాలో ప్రతి నెలా రూ. 25,000 నగదు ఉపసంహరించుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించబడవు.(ప్రతీకాత్మక చిత్రం)