1. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) అకౌంట్ ఉన్నవారికి అలర్ట్. వచ్చే ఏడాది నుంచి క్యాష్ డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసినా ఛార్జీలు చెల్లించక తప్పదు. ఈ బ్యాంకు కస్టమర్లకు ఇచ్చిన లిమిట్ వరకు క్యాష్ డిపాజిట్ చేయొచ్చు లేదా విత్‌డ్రా చేయొచ్చు. లిమిట్ దాటితే మాత్రం ఛార్జీలు చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Basic Savings Account: బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి నెలకు నాలుగు సార్లు క్యాష్ విత్‌డ్రాయల్ ఉచితం. ఆ తర్వాత ఛార్జీలు చెల్లించాలి. డ్రా చేయాలనుకున్న మొత్తంలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి. ఈ అకౌంట్ ఉన్నవారికి క్యాష్ డిపాజిట్ ఉచితం. ఎన్నిసార్లైనా నగదు డిపాజిట్ చేయొచ్చు. పైన చెప్పిన ఛార్జీలపై జీఎస్టీ లేదా సెస్ కూడా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. Savings and Current Accounts: ఇతర సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్‌కు నెలకు రూ.25,000 వరకు క్యాష్ విత్‌డ్రాయల్ ఉచితం. ఆ తర్వాత విత్‌డ్రా చేయాలనుకునే మొత్తంలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి ఛార్జీ చెల్లించాలి. ఇక ఈ అకౌంట్లలో నెలకు రూ.10,000 వరకు క్యాష్ డిపాజిట్ ఉచితం. ఆ తర్వాత డిపాజిట్ చేయాలనుకునే మొత్తానికి 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి ఛార్జీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక మరోవైపు బ్యాంకింగ్ విత్ క్యూఆర్ కార్డ్ పేరుతో సేవింగ్స్ అకౌంట్‌కు వినూత్నమైన ఫీచర్ అందించింది IPPB. క్యూఆర్ కార్డ్ ఉన్నవారు తమ అకౌంట్ నెంబర్, పాస్వర్క్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కార్డ్ స్కాన్ చేసి బ్యాంకింగ్ లావాదేవీలు జరపొచ్చు. బయోమెట్రిక్స్ ద్వారా ఆథెంటికేషన్ చేయొచ్చు. IPPB అకౌంట్ నుంచి నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)