1. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్. సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటును తగ్గించింది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. 25 బేసిస్ పాయింట్స్ అంటే పావు శాతం వడ్డీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని సేవింగ్స్ అకౌంట్లపై ఇది వర్తిస్తుంది. తగ్గిన వడ్డీ 2022 జూన్ 1 నుంచే అమలులోకి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అసెట్ లయబిలిటీ కమిటీ ఆమోదించిన పాలసీ ప్రకారం అన్ని సేవింగ్స్ అకౌంట్స్‌పై వడ్డీ రేటును సవరిస్తున్నామని ఐపీపీబీ నోటీసు విడుదల చేసింది. రూ.1 లక్ష లోపు బ్యాలెన్స్ ఉంటే ఇకపై 2 శాతం వార్షిక వడ్డీ మాత్రమే లభిస్తుంది. గతంలో ఈ వార్షిక వడ్డీ 2.25 శాతం ఉండేది. ఇక రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల బ్యాలెన్స్‌కు వడ్డీ 2.25 శాతం లభిస్తుంది. గతంలో ఈ వడ్డీ 2.50 శాతం ఉండేది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్ పరిగణలోకి తీసుకొని మూడు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తుంది ఐపీపీబీ. సేవింగ్స్ అకౌంట్స్ విషయంలో గత కొంతకాలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఐపీపీబీ. డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి కొత్త ఛార్జీలు అమలు చేసింది. డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేస్తే రూ.150+జీఎస్టీ వసూలు చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే 12 నెలల లోపు కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. లేదా అకౌంట్ క్లోజ్ చేయాలి. కేవైసీ పూర్తి చేస్తే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్‌ను రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌గా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. డిజిటల్ అకౌంట్ క్లోజ్ చేస్తే రూ.150+జీఎస్టీ చెల్లించాలి. ఈ ఛార్జీలు 2022 మార్చి 5 నుంచి అమల్లోకి వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. 18 ఏళ్లు దాటినవారు డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ తీసుకోవచ్చు. డిజిటల్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తప్పనిసరి. డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లో ప్రతీ ఏటా రూ.2,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఎక్కువ వడ్డీ లభిస్తుంది. కస్టమర్లు 4 శాతం వార్షిక వడ్డీ పొందొచ్చు. కస్టమర్లు వ్యక్తిగతంగా లేదా జాయింట్‌గా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఏటీఎం కార్డ్, చెక్ బుక్, మొబైల్ బ్యాంకింగ్ లాంటివి లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)