Hyderabad Gold ATM | ఏటీఎం గురించి మనకు బాగా తెలుసు. తరుచుగా ఏటీఎం సెంటర్కు వెళ్లి డబ్బులు విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. దాదాపు అన్ని బ్యాంకులు ఏటీఎం సర్వీసులు అందిస్తున్నాయి. డెబిట్ కార్డు సాయంతో డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఈ మధ్యన కొన్ని బ్యాంకులు ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించాయి.
కంపెనీ మరిన్ని గోల్డ్ ఏటీఎంలను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఎయిర్పోర్ట్, ఓల్డ్ సిటీలో కూడా వీటిని ఏర్పాటు చేయనుంది. ఇంకా కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో కూడా గోల్డ్ ఏటీఎం మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే రెండేళ్ల కాలంలో 3 వేల గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు వెళ్తోంది.
తెలంగాణ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మా రెడ్డి ఈ గోల్డ్ ఏటీఎం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే గోల్డ్ సిఖ చైర్పర్సన్ అంబికా బుర్మన్, ఓపెన్క్యూబ్ టెక్నాలజీస్ సీఈవో పి.వినోద్ కుమార్, టీ హాబ్ సీఈవో ఎం శ్రీనివాస్ రావు తదితరులు కూడా పాల్గొన్నారు. ఇంకెందుకు ఆలస్యం మీకు గోల్డ్ కాయిన్లు కావాలంటే వెంటనే ఈ ఏటీఎం వద్దకు వెళ్లి నచ్చిన పరిమాణంలో మీరు గోల్డ్ కాయిన్లను కొనుగోలు చేయొచ్చు.