దిగుమతిదారులకు ఈ సుంకాల ప్రాతిపదికన ట్యాక్స్ ఎంత కట్టాలనే అంశం నిర్ణయం అవుతుంది. వంట నూనె, వెండి దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుడిగా కొనసాగుతోంది. అలాగే బంగారం వినియోగంలో కూడా మన దేశంలో రెండో స్థానంలో ఉంది. దేశంలో బంగరాం ధరలపై 15 శాతం దిగుమతి సుంకం ఉంటుంది. అలాగే 3 శాతం జీఎస్టీ పడుతుంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు నేడు పైకి కదిలాయి. డాలర్ ఇండెక్స్ ర్యాలీ ఆగిపోవడం ఇందుకు కారణం. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.4 శాతం పెరుగుదలతో ఔన్స్‌కు 1648 డాలర్లకు చేరింది. కాగా బంగారం ధర గత వారంలో 3 శాతం పతనమైన విషయం తెలిసిందే. అలాగే వెండి రేటును గమనిస్తే.. ఈరోజు సిల్వర్ రేటు 0.7 శాతం పైకి చేరింది. వెండి ధర ఔన్స్‌కు 18.39 డాలర్లకు ఎగసింది.
ఇకపోతే హైదరాబాద్ మార్కెట్లో అక్టోబర్ 17న బంగారం ధరలు పైకి చేరాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పైకి చేరింది. రూ. 50,670కు ఎగసింది. 24 క్యారెట్లకు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 250 పెరుగుదలతో రూ. 46,450కు చేరింది. ఈ రేట్లకు జీఎస్టీ, తయారీ చార్జీలు వంటివి అదనం.