1. ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు శుభవార్త. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లైట్ వెయిట్ సిలిండర్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ భారీగా ఉంటుంది. నిండుగా ఉన్న సిలిండర్ కాదు... ఖాళీగా ఉన్న సిలిండర్ మోయాలన్నా భారమే. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కాంపోజిట్ సిలిండర్లను (Composite Cylinder) ఆఫర్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. కాంపోజిట్ సిలిండర్‌తో ఉపయోగం ఏంటా అనుకుంటున్నారా? ఇది లైట్ వెయిట్ సిలిండర్. ప్రస్తుతం ఉన్న సిలిండర్ బరువు కన్నా సగం బరువే ఉంటుంది. కాంపోజిట్ సిలిండర్ పారదర్శకంగా ఉంటుంది. కాబట్టి సిలిండర్ లోపల ఎల్పీజీ లెవెల్ తెలుసుకోవచ్చు. సిలిండర్ ఖాళీ అయిన విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి రీఫిల్ కోసం కస్టమర్లు ప్లాన్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. కాంపోజిట్ సిలిండర్లు తుప్పుపట్టవు. సిలిండర్ పైన ఎలాంటి మరకలు ఉండవు. మోడర్న్ కిచెన్లలో వాడుకోవడానికి ఈ సిలిండర్లు బాగుంటాయి. 10 కేజీ కాంపోజిట్ సిలిండర్ డొమెస్టిక్ నాన్ సబ్సిడైజ్డ్ కేటగిరీలో మాత్రమే అందుబాటులో ఉండగా, 5 కేజీ వేరియంట్ డొమెస్టిక్ నాన్ సబ్సిడైజ్డ్ కేటగిరీ, ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ రూపంలో అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కాంపోజిట్ సిలిండర్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. 10 కేజీ వేరియంట్‌కు రూ.3350 చెల్లించాలి. 5కేజీ వేరియంట్‌కు రూ.2150 చెల్లించాలి. ప్రస్తుతం ఉన్న సిలిండర్‌ను కాంపోజిట్ సిలిండర్‌కు రీప్లేస్ చేయొచ్చు. సెక్యూరిటీ డిపాజిట్లో ఉన్న తేడాను చెల్లించాల్సి ఉంటుంది. కాంపోజిట్ సిలిండర్‌ను ఇండేన్ డిస్ట్రిబ్యూటర్స్ ఇంటికి కూడా డెలివర్ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక 5కేజీ కాంపోజిట్ సిలిండర్ ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ కేటగిరీలో కూడా అందుబాటులో ఉంది. 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ ధర రూ.2,537 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. రీఫిల్ కాస్ట్ ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక హైదరాబాద్‌లో 10 కేజీ కాంపోజిట్ సిలిండర్ రీఫిల్ ధర రూ.749.5 కాగా, 5కేజీ కాంపోజిట్ సిలిండర్ రీఫిల్ ధర రూ.385.5. (ప్రతీకాత్మక చిత్రం)
7. కాంపోజిట్ సిలిండర్ తీసుకోవాలంటే మీకు సమీపంలో ఉన్న ఇండేన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర వివరాలు తెలుసుకోవచ్చు. కాంపోజిట్ సిలిండర్లు ప్రధాన నగరాలు, పట్టణాల్లో కొందరు డిస్ట్రిబ్యూటర్ల దగ్గరే లభిస్తాయి. 5 కేజీ, 10 కేజీ సైజ్‌లో కాంపోజిట్ సిలిండర్ కొనొచ్చు. ఏఏ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర కాంపోజిట్ సిలిండర్ లభిస్తుందో తెలుసుకోవడానికి https://iocl.com/composite-cylinder లింక్ క్లిక్ చేయాలి. చివర్లో ఉన్న ఆప్షన్స్‌లో మీ ఊరి పేరు సెలెక్ట్ చేస్తే ఏఏ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర కాంపోజిట్ సిలిండర్ అందుబాటులో ఉందో తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)