Income Tax Returns: ఆదాయపన్ను రిటర్నులు దాఖలు గడువు పెంపు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే

ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 10 రోజుల గడువు ఇచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులను జనవరి 10 వరకు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది.