1. ప్రస్తుతం ఏ చిన్న ఆర్థిక లావాదేవీ చేయాలన్నా పాన్ కార్డ్ (PAN Card) తప్పనిసరి. బ్యాంకు ట్రాన్సాక్షన్ల నుంచి, ఐటీఆర్ ఫైలింగ్ వరకు పాన్‌తో లింక్ అయి ఉంటాయి. సాధారణంగా ఒక వ్యక్తికే రెండు పాన్ నంబర్లు ఉండటం చట్టరీత్యా నేరం. కానీ ఒకే పాన్ నంబర్ ఇద్దరు వ్యక్తులకు ఉంటే ఏం చేయాలి? ఈ తరహా వింత కేసు మంగళవారం ఢిల్లీ హైకోర్టు ముందుకు వచ్చింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఒకరి పాన్ నంబర్‌ను మరొకరికి కేటాయించడానికి కారణమైన లోపాలను సరిదిద్దాలని సంబంధిత ఆధికారులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. తనకు సంబంధం లేని రూ.2 లక్షల క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించాలని నోటీసులు వస్తున్నాయని చెప్పారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్ట్.. ఈ అంశంలో ఆదాయ పన్ను శాఖ వివరణ కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ఈ పిటిషన్‌పై డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్టరేట్ ఆప్ ఇన్కమ్ ట్యాక్స్(సిస్టమ్), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (CIBIL) వివరణ కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఏప్రిల్ 21న తదుపరి విచారణకు ఈ కేసును హైకోర్టు లిస్ట్ చేసింది. తుది తీర్పు వెలువడే వరకు క్రెడిట్ కార్డ్ చెల్లింపులు చేయనందుకు పిటిషనర్‌పై బ్యాంక్ ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అమిత్ వర్మ మాట్లాడుతూ.. తన క్లయింట్ పాన్ నంబర్‌ను వేరొకరికి కేటాయించడం వల్ల, అతని క్రెడిట్ స్కోర్లు ప్రభావితమవుతున్నాయని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. దీనివల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. 2017 ఆగస్టు 15న తప్పు ఐటీఆర్‌ను దాఖలు చేసినందుకు ఆదాయ పన్ను నోటీసు అందుకున్నప్పుడు పిటిషనర్ డూప్లికేట్ పాన్ గురించి తెలుసుకున్నారని న్యాయవాది చెప్పారు. ఆ తర్వాత పాన్‌లో కరెక్షన్ల కోసం పిటిషనర్ చాలాసార్లు ప్రతివాదులను సంప్రదించినప్పటికీ ఫలితం లేదని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. తాను క్రెడిట్ కార్డ్ హోల్డర్ కానందున తన అప్పులన్నింటినీ రద్దు చేయాలని, నోటీసులు పంపకూడదని SBIని ఆదేశించాలని పిటిషన్ కోరారు. అనవసరంగా పిటిషనర్ క్రెడిట్ స్కోర్ దెబ్బతిందని, క్రెడిట్ స్కోర్‌ను సరిదిద్దాలని సిబిల్‌ను ఆదేశించాలని కూడా చెప్పారు. తనపై వేధింపులు, పరువు నష్టం కింద పరిహారం అందజేయాలని పిటిషన్ కోరారు. (ప్రతీకాత్మక చిత్రం)