ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుండటం, మరోవైపు కాలుష్యం పెరుగుతుండటంతో ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. దీన్ని దృష్టిపెట్టుకొని ఇప్పటికే పలు ఆటో మొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. వీటితో పాటు స్టార్టప్ సంస్థలు కూడా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. TVS iQube. (Photo: Anirudh Sunil Kumar/News18.com)
దీంతో సమీప భవిష్యత్తులో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగనుందని స్పష్టమవుతోంది. ఈ పోటీలో ముందుండేందుకు అన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ గతేడాది ఐక్యూబ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్కూటర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో మరికొద్ది రోజుల్లోనే 20 నగరాల్లో తమ సేవలను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. TVS iQube. (Photo: Anirudh Sunil Kumar/News18.com)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ విస్తరణ పనులను పూర్తి చేయాలని సంస్థ యోచిస్తోంది. ఇందులో భాగంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో సుమారు 500 నుంచి 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఐక్యూబ్ మొదట బెంగళూరులో ప్రారంభమైంది. ఆ తర్వాత ఢిల్లీలో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. TVS iQube. (Photo: Anirudh Sunil Kumar/News18.com)
ఇక రాబోయే కొద్ది నెలల్లోనే ముంబై, చెన్నై, పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా వంటి ఇతర అగ్రశ్రేణి నగరాలతో పాటు అనేక టైర్ 1 నగరాల్లో దీన్ని ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ టూవీలర్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్న నగరాలతో పాటు బ్యాటరీ ఛార్జింగ్ అందుబాటులో ఉన్న నగరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నారు. TVS iQube. (Photo: Anirudh Sunil Kumar/News18.com)
ఐక్యూబ్ ఎలక్ట్రిక్ టూవీలర్లో అద్భుతమైన ఫీచర్లను అందించారు. ఇది నెక్ట్స్-జెన్ టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్ ప్లాట్ఫామ్లో విడుదలైంది. దీనిలో అధునాతన టిఎఫ్టి క్లస్టర్, టివిఎస్ ఐక్యూబ్ యాప్‌ను కూడా అందించారు. ఈ యాప్‌లో జియో-ఫెన్సింగ్, నావిగేషన్ అసిస్ట్, రిమోట్ బ్యాటరీ ఛార్జ్ స్టేటస్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, ఇన్కమింగ్ కాల్/ SMS అలర్ట్ వంటి మల్టిపుల్ కనెక్టివిటీ ఫీచర్లను చేర్చింది. ఇక దీంట్లో 4.4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారును జోడించింది. TVS iQube. (Photo: Anirudh Sunil Kumar/News18.com)
ఈ మోటారు సహాయంతో 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.2 సెకన్లలో అందుకోగలదు. ఇక ఇది గరిష్టంగా 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు 75 కిలోమీటర్ల ప్రయాణాన్ని అందిస్తుంది. ఒక్క టీవీఎస్ మాత్రమే కాదు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఉన్న చాలా కంపెనీలు విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. TVS iQube. (Photo: Anirudh Sunil Kumar/News18.com)