ఈ సరికొత్త వాహనం అత్యాధునిక ఫీచర్లతో పాటు ఉత్తమ స్టైలింగ్ డిజైన్‌తో అందుబాటులో ఉంటుందని కంపెనీ వివరించింది. రెనాల్డ్ కిగర్‌లో ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్, రివర్స్ లైట్, హై విండ్‌షీల్డ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లను అందించింది. అంతేకాక, దీన్ని షార్క్ ఫిన్ యాంటెనాలు, రియర్ వైపర్లు, 5 స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో డిజైన్ చేశారు. ముఖ్యంగా, యువతను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. (Image: Anirudh Sunil Kumar/News18.com)
కిగర్ ఎస్యూవీ వాహనం నిస్సాన్ మాగ్నైట్‌లో ఉన్న విధంగానే మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఇది 1.0 -లీటర్ టర్బో చార్జిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 100 బిహెచ్పీ, 160 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్లకు జతచేయబడుతుంది. అంతేకాక, ఇది 205 మిల్లీ మీటర్ల గ్రౌండ్ క్లియరెన్ష్, 405 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుందని చెబుతున్నారు. (Image: Anirudh Sunil Kumar/News18.com)
ఇతర ఎస్యూవీ వాహనాలకు భిన్నంగా కిగర్‌లో అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. దీని సెగ్మెంట్ ఎక్కువ క్యాబిన్ స్థలాన్ని అందిస్తుంది. ఇక దీని లెగ్, ఎల్బో రూమ్ విషయానికి వస్తే 405 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తూ, వెనుక సీట్లు ముడుచుకొని ఉంటుంది. దీని ఇంజన్ కెపాసిటీని 879 లీటర్లకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది. రెనాల్ట్ కిగర్ 2020లోనే విడుదల కావాల్సి ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడూతూ వచ్చింది. (Image: Anirudh Sunil Kumar/News18.com)
కిగర్ ఎస్యూవీ వాహనం సెంటర్ కన్సోల్ వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతో 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. వీటితో పాటు దీనిలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, 7 అంగుళాల టిఎఫ్టి డిస్ప్లే యూనిట్, 2.5 పిఎం ఎయిర్ ఫిల్టర్, పుష్-బటన్ స్టార్ట్, వాయిస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. (Image: Anirudh Sunil Kumar/News18.com)
అయితే, దీని ధరను మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. కాగా, మార్కెట్లో ఇప్పటికే ఉన్న కిగర్ మాగ్నైట్ బేస్ వెర్షన్ ప్రస్తుతం రూ.6.47 లక్షలకు లభిస్తుంది. ఇక టాప్-ఎండ్ టర్బో వేరియంట్ రూ .11.21 లక్షలకు లభిస్తుంది. నూతనంగా విడుదల కానున్న కిగర్ వేరియంట్ కూడా ఇదే ధరల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. (Image: Anirudh Sunil Kumar/News18.com)