సెలెరియో (Mariti Suzuki selerio) మొదటి కారు 2014లో విడుదలవ్వగా.. ఈ ఏడేళ్లలో కంపెనీ మొత్తం 5.9 లక్షల యూనిట్ల కార్లను విక్రయించింది. తాజాగా విడుదలైన లేటెస్ట్ మోడల్ ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. రూ. 11 వేల టోకెన్ ఫీజు చెల్లించి నేటి నుంచి కారును బుక్ చేసుకోవచ్చు. (Image: Manav Sinha/News18.com)
న్యూ జనరేషన్ మారుతి సుజుకి సెలెరియో పాత మోడల్ కంటే ఆకారంలో కాస్త విశాలంగా ఉంటుంది. ఈ కారును పూర్తిగా రీడిజైన్ చేసింది. దీని ముందు భాగంలో క్రోమ్ యాక్సెంట్లు, సుజుకి లోగోతో కూడిన గ్రిల్‌ను ఏర్పాటు చేసింది. ఇది బ్లాక్ అవుట్ మల్టీ స్పెక్ అల్లాయ్ వీల్స్‌ను అందించింది. అన్ని డోర్స్‌పై లిఫ్ట్ టు ఓపెన్ టైప్ హ్యాండిల్స్‌కు మద్దతిస్తుంది. బూట్ లిడ్‌లో బ్యాక్ పార్కింగ్ కెమెరాను కూడా చేర్చింది. ఇక కారు లోపలి భాగాన్ని పూర్తిగా పునరుద్ధరించింది. (Image: Manav Sinha/News18.com)
పాత మోడల్‌తో పోలిస్తే ఇది చాలా ఆధునికంగా కనిపిస్తుంది. దీని లోపలి భాగంలో ప్రకాశవంతమైన క్రోమ్ యాక్సెంట్లు, బోల్డ్ బ్యారెల్-థీమ్ సైడ్ ఎయిర్ వెంట్లతో కూడిన ట్విన్-స్లాట్ సెంటర్, ఏసీ వెంటిలేషన్‌ను అందించింది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీతో కూడిన 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను చేర్చింది. డ్యాష్‌బోర్డ్‌లో పవర్ విండో స్విచ్‌లను కూడా చేర్చింది. (Image: Maruti Suzuki)
కొత్త మారుతి సుజుకి సెలెరియోలో వ్యాగన్ఆర్ వంటి ఇంజిన్‌ను అందించింది. ఈ కారు 1.0 లీటర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్లలో లభిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. ఈ రెండు ఇంజిన్లు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ టార్క్, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 67 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. (Image: Maruti Suzuki)