1. భారతదేశంలో తొలి ట్యాక్స్ సేవర్ ఇండెక్స్ ఫండ్ అందుబాటులోకి వచ్చింది. ఐఐఎఫ్ఎల్ ఈఎల్ఎస్ఎస్ నిఫ్టీ 50 ట్యాక్స్ సేవర్ ఇండెక్స్ ఫండ్ (IIFL ELSS Nifty 50 Tax Saver Index Fund) న్యూ ఫండ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ ఇటీవల ప్రారంభమైంది. డిసెంబర్ 21 వరకు ఎన్ఎఫ్ఓ అందుబాటులో ఉంటుంది. 2023 జనవరి 2 నుంచి సబ్స్క్రిప్షన్స్, రిడెంప్షన్స్ ప్రారంభమవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఐఐఎఫ్ఎల్ ఈఎల్ఎస్ఎస్ నిఫ్టీ 50 ట్యాక్స్ సేవర్ ఇండెక్స్ ఫండ్‌కు పారిజాత్ గార్గ్ ఫండ్ మేనేజర్‌గా ఉన్నారు. ఇది ఓపెన్ ఎండెడ్ ప్యాసీవ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఇందులో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు నిఫ్టీ 50 ఇండెక్స్‌లోకి (Nifty 50 Index) వెళ్తాయి. అంటే స్టాక్ మార్కెట్లోని టాప్ 50 కంపెనీల్లోకి పెట్టుబడులు వెళ్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఐఎఫ్ఎల్ ఈఎల్ఎస్ఎస్ నిఫ్టీ 50 ట్యాక్స్ సేవర్ ఇండెక్స్ ఫండ్ వివరాలు చూస్తే మార్కెట్లో ఇప్పటి వరకు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ చాలానే ఉన్నాయి. కానీ తొలిసారి ఈ సెగ్మెంట్లో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌ను ఐఐఎఫ్ఎల్ తీసుకురావడం విశేషం. ఈ ఫండ్‌లో మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇప్పుడు చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ను మూడేళ్ల తర్వాతే రీడీమ్ చేసుకోవచ్చు. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్ పొందడంతో పాటు, సంపదను సృష్టించవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. పన్ను మినహాయింపు పొందడంతో పాటు దీర్ఘకాలం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చే ప్రయోజనాలు కూడా పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐఐఎఫ్ఎల్ ఈఎల్ఎస్ఎస్ నిఫ్టీ 50 ట్యాక్స్ సేవర్ ఇండెక్స్ ఫండ్‌లో కనీసం రూ.500 తో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు. మిగతా మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ. ఎగ్జిట్ లోడ్ కూడా ఉండదు. ఈ ఫండ్ ద్వారా ఇన్వెస్టర్ ఏటా రూ.46,800 వరకు పన్ను ప్రయోజనాలు పొందొచ్చని ఐఐఎఫ్ఎల్ మ్యూచువల్ ఫండ్ వివరిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. అధికారిక వెబ్సైట్లో ఓ ఉదాహరణను కూడా వివరించింది. ఉదాహరణకు రూ.12 లక్షల వార్షికాదాయం ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.46,800 పన్ను మినహాయింపులు పొందొచ్చు. అయితే ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినా గ్యారెంటీగా ఇంత రిటర్న్స్ వస్తాయని ఎవరూ ముందుగానే చెప్పరు. (ప్రతీకాత్మక చిత్రం)