ఎవరైనా ఈ స్టాక్‌లో గత ఏడాది లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ దాదాపు రూ.1.80 కోట్లు అయ్యేది. లక్షా 15వేలు పెడితే.. ఇప్పుడు 2 కోట్లకు చేరేది. కనీసం వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేసినా రూ. లక్షా 80 లక్షలకు పెరిగేది. రూ.10వేలు పెట్టి ఉంటే.. ఇప్పుడు 18 లక్షల రూపాయలు వచ్చేవి.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఏడాది ప్రారంభం నుంచి SELషేరు 395.48 శాతం పెరిగింది. ఈ స్టాక్ ఒక నెలలో 128 శాతం, వారంలో 21.49% లాభపడింది. బిఎస్ఇలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.618 కోట్లుగా ఉంది. మార్చి 8, 2021న షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ.1.14ను తాకింది. ఆ తర్వాత రాకెట్లా దూసుకెళ్లి.. ప్రస్తుతం రూ.200లు దాటింది. (ప్రతీకాత్మక చిత్రం)
డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థలో ఎనిమిది మంది ప్రమోటర్లు 75.27 శాతం వాటాను కలిగి ఉన్నారు. 16,521 పబ్లిక్ వాటాదారులకు 24.73 శాతం వాటా ఉంది. వీరిలో 15,546 పబ్లిక్ వాటాదారులకు 0.46 శాతం వాటా మాత్రమే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ముగ్గురు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు 42,178 షేర్లను కలిగి ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)