PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు రాని రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి
PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు రాని రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి
కేంద్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించిన డబ్బులను అనేక మంది రైతులు వివిధ కారణాలతో పొందలేక పోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన(PMKSNY) పథకం యొక్క తొమ్మిదవ విడత డబ్బులను కేంద్రం నిన్న(సోమవారం) దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అయితే అనేక మంది రైతులు వివిధ కారణాలతో ఆ ప్రభుత్వ సాయాన్ని పొందలేక పోయారు. కానీ ఇంకా వాయిదా డబ్బును అందుకోని రైతులు అనేక మంది ఉన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
అయితే వారంతా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలా ఫిర్యాదు చేసి డబ్బులను పొందవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి మీ బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ చేయబడుతుంది. కానీ రైతుల ఖాతాకు చేరదు. దీనికి ప్రధాన కారణం మీ ఆధార్, అకౌంట్ నంబర్ మరియు బ్యాంక్ అకౌంట్ నంబర్లోని తప్పు కావచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ముందుగా మీరు మీ ప్రాంతంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. సమస్య గురిచి వారికి తెలియజేయాలి. ఒక వేళ వారు సరిగా స్పందించకపోతే హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
డబ్బు అందని వారు హెల్ప్‌లైన్ నంబర్ 011 24300606 /011 23381092 కు కాల్ చేయవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు, PM కిసాన్ హెల్ప్ డెస్క్ (PM KISAN హెల్ప్ డెస్క్) pmkisan ict@gov.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీం ద్వారా రైతులకు ఏడాదికి రూ .6000 ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ. 2 వేల చొప్పన ప్రభుత్వం అందిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)