PF New Rule: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఇలా చేస్తేనే వచ్చే నెల నుంచి పీఎఫ్ డబ్బులు.. తప్పక తెలుసుకోండి
PF New Rule: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఇలా చేస్తేనే వచ్చే నెల నుంచి పీఎఫ్ డబ్బులు.. తప్పక తెలుసుకోండి
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వశాఖ సామాజిక భద్రత-2020 చట్టంలో సెక్షన్-142 ను ఈపీఎఫ్ఓ సవరించింది. వివరాలు..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు ఈపీఎఫ్ఓ కీలక సూచనలు చేసింది. సెప్టెంబర్ 1 లోగా ఆధార్ కార్డును ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలతో లింక్ చేసుకోవాలని స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
పీఎఫ్ ఖాతాలతో ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ డబ్బులు జమ కావని తెలిపింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వశాఖ సామాజిక భద్రత-2020 చట్టంలో సెక్షన్-142 ను ఈపీఎఫ్ఓ సవరించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
దీంతో ఉద్యోగులు ఇతర బెనిఫిట్స్, సేవలను పొందడం కోసం ఆధార్ నంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి కానుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
ఈపీఎఫ్ ఆధార్ లింక్ చేయండిలా: (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
1. ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్సైట్ www.epfindia.gov.in ఓపెన్ చేసి లాగిన్ కావాలి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
2. అనంతరం ఆన్లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేసి ఈ-కెవైసి పోర్టల్‌కు వెళ్లాలి. అనంతరం యుఎఎన్ ఆధార్ లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
3. మీ యుఎఎన్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఇలా చేస్తే మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీని పొందుతారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
4. ఓటీపీని, 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసి ఫారమ్‌ను సమర్పించండి. ఇప్పుడు ఓటీపీ ధృవీకరణ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
5.మీ ఆధార్ వివరాలను ధృవీకరించడానికి మీ ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్, మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ వ్యాలిడేషన్ తర్వాత మీ ఆధార్ మీ పీఎఫ్ ఖాతాకు లింక్ అవుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)