Loan EMI | బ్యాంకులు వరుస పెట్టి కస్టమర్లకు ఝలక్ ఇస్తున్నాయి. తాజాగా మరో బ్యంక్ కూడా ఇదే దారిలో నడిచింది. ప్రైవేట్ రంగానికి చెందిన ఐడీఎఫ్సీ బ్యాంక్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రుణాలపై వడ్డీ రేట్లను పెంచేసింది. రుణ రేట్లు పెంచుతున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఎంసీఎల్ఆర్ రేటును పెంచింది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుందని చెప్పుకోవచ్చు.
దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపో రేటును పెంచడం వల్ల బ్యాంకులు కూడా రుణ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటు గత ఏడాది మే నెల నుంచి పెరుగుతూనే వస్తోంది. దీంతో బ్యాంకులు కూడా రుణ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అయితే రుణ రేట్ల కన్నా ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంపు తక్కువగా ఉంది.