వృత్తిపరంగా పొరపాట్లు జరిగినప్పుడు డాక్టర్లకు (Doctors) న్యాయపరమైన చిక్కులతో సహా నష్టపరిహారం (Indemnity) చెల్లించే పరిస్థితి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్లకు రక్షణ అందించే ఓ సరికొత్త పాలసీని ఐసీఐసీఐ లాంబార్డ్ (ICICI Lombard) లాంచ్ చేసింది. ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఐసీఐసీఐ లాంబార్డ్... ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ (Professional Indemnity Insurance)ను తాజాగా ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ పాలసీ అన్ని స్పెషలైజేషన్లను కవర్ చేస్తుంది. అంటే డాక్టర్లు ఏ స్పెషలైజేషన్‌లో ఉన్నా ఈ పాలసీ వర్తిస్తుంది. అలానే తక్షణ పాలసీ జారీని అందిస్తుంది. ఈ పాలసీ పారదర్శకతో వస్తుంది. అంతేకాకుండా సరసమైన ధర, అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రక్రియ, క్లెయిమ్‌ల విషయంలో న్యాయ సలహా సేవల సపోర్ట్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ పాలసీ డాక్టర్లకు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది? ఈ పాలసీని కొనుగోలు చేయడం డాక్టర్లకు ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
"ప్రొఫెషనల్ డాక్టర్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక సందర్భంలో మానవ తప్పిదాలు జరుగుతాయి. ఇలాంటి తప్పిదాలకు బాధ్యత వహించాలని డాక్టర్లపై రోగుల బంధువుల చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తారు. అయితే ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు డాక్టర్లకు మద్దతునిచ్చేందుకే ఈ పాలసీని రూపొందించాం" అని ఐసీఐసీఐ లాంబార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
వృత్తిపరమైన నష్టపరిహార బీమా లేదా ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ అనేది రోగుల బంధువులు దావా వేసినప్పుడు డాక్టర్లకు చట్టపరంగా, ఆర్థికంగా మద్దతునిస్తుంది. ఈ పాలసీ కేసు విచారణ సమయంలో జరిగే రక్షణ ఖర్చులు, ప్రాతినిధ్య ఖర్చులు, తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా సంభవించే శారీరక గాయం లేదా మరణం వల్ల ఉత్పన్నమయ్యే క్లెయిమ్‌లకు పరిహారం.. ఇలా చాలా ఖర్చులకు కవరేజీని అందిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు లేదా వెబ్సైట్ www.sme.icicilombard.com ద్వారా తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ పాలసీ మెడికల్ ప్రాక్టీషనర్ తప్పు లేనప్పుడు వేసే చెల్లని క్లెయిమ్‌లకు కూడా కవరేజీని అందిస్తుంది. ఇలాంటి క్లెయిమ్‌లకు చట్టపరమైన రుసుములు, సెటిల్మెంట్ పరిహారాన్ని అందించాల్సిందిగా కోర్టు ఆర్డర్ వేస్తే.. ఆ ఖర్చులను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఐసీఐసీఐ లాంబార్డ్ (ICICI Lombard) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి మాట్లాడుతూ... "డాక్టర్లు, హెల్త్‌కేర్ ఎక్స్పర్ట్స్ రోగుల ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏదో ఒక పొరపాటు జరిగే అవకాశం ఉంది. పొరపాటు జరగడం, కొన్నిసార్లు అనుకోకుండా నిర్లక్ష్యం చేయడం వారి వృత్తి జీవితంలో ఒక భాగం" అని చెప్పుకొచ్చారు. “తప్పు జరిగినప్పుడు.. వైద్యపరమైన నిర్లక్ష్యానికి డాక్టర్ నష్టపరిహారం చెల్లించాలని క్లెయిమ్ చేసే హక్కు బాధిత వ్యక్తికి ఉంటుంది. అలాంటి సందర్భాలలో, మా ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ రక్షణ ఖర్చులు, పరిహార క్లెయిమ్‌లతో పాటు గాయం వంటి అన్ని వృత్తిపరమైన నష్టాల నుంచి అలాగే చెల్లని క్లెయిమ్‌ల నుంచి వైద్యులను రక్షిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఒక కంపెనీగా, మేం డాక్టర్లకు ఆర్థిక, చట్టపరమైన భద్రతను అందించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకంటే అవసరమైన ఆర్థిక, చట్టపరమైన భద్రతను పొందడానికి డాక్టర్లకు నిజంగా అర్హత ఉంది, ”అని సంజీవ్ వివరించారు. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తన కస్టమర్లకు మోటారు, హెల్త్, పంట, అగ్ని ప్రమాదం, వ్యక్తిగత ప్రమాదం, సముద్ర, ఇంజనీరింగ్ బీమాతో సహా సమగ్రమైన, విభిన్నమైన పాలసీలను అందిస్తోంది.